ఎవరా నలుగురు.. ఏమా కథ.. వేటేనా?

Publish Date:Mar 24, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇంతవరకు ఓ లెక్క ..ఇకపై మరో లెక్క, అన్నట్లుగా మారి పోయాయి. గత సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఓటమి చూడలేదన్న అహంకారంతో విర్రవీగుతున్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అక్కడితో ఆగలేదు...అక్కడ గ్రాడ్యుయేట్స్  అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్’ ఇస్తే,  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మైండ్ బ్లాక్ అయ్యే మరో షాక్ ఇచ్చారు.

నేను మోనార్క్ ను నా మాటే శాసనం అన్నట్లుగా తమకు తిరుగులేదని విర్ర వీగిన జగన్ రెడ్డికి సొంత పార్టీ ఏమ్మేల్యేలు ఝలక్ ఇచ్చారు. పకడ్బందీ వ్యూహంతో పావులు కదిపినా ఒకరు ఇద్దరు కాదు  ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు సాహసించారు. జగన్ రెడ్డి హుకుంను ధిక్కరించారు. టీడీపీ  అభ్యర్ధి పంచుమర్తి అనురాధను గెలిపించారు. అయితే ఇప్పడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? జగన్ రెడ్డిని పరాభవానికి  గురి చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ రెడ్డి స్పందన ఏమిటి? ఇక ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తారు? ఎమ్మెల్యేల ధిక్కారాన్ని దిగమింగి ఊరుకుంటారా? ఆ నలుగురిని గుర్తించి వేటు వేస్తారా? ఉప ఎన్నికలకు సాహసిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 నిజానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం అనూహ్యం అయితే కావచ్చును కానీ కచ్చితంగా ధర్మ విజయం. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఒక అభ్యర్ధి గెలవాలంటే  22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీ బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేల్లో కరణం బలరాం, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ అధికారికంగా తెలుగు దేశం ఏమ్మేల్యేలుగా కొనసాగుతూనే  వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభలో టీడీపీ  వాస్తవ సంఖ్యా బలం 19కి తగ్గింది.

ఆ నలుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా టీడీపీ విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే.. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన  ఆ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అయితే..  ముందుగానే అత్మప్రభోధం మేరకు ఓటి వేస్తామని బహిరంగంగా ప్రకటించిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు కలిపినా టీడీపీకి పడాల్సింది -21 ఓట్లు మాత్రమే. దీంతో అనూరాధ కు ఓట్లు వేసిన ఆ ద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ముందుగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇదే సమయంలో.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరూ ప్రముఖంగా వినిపించింది.

ఈ నేపథ్యంలో.. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఉండవల్లి శ్రీదేవి కూడా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉదయమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిశానని.. తాను ఎందుకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతానని ప్రశ్నించారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో అధికార వైసీపీలో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి. వీరందరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోతే.. ఆ పని ఎవరు చేశారనే చర్చ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో ఏడుకు.. ఏడు స్థానాలు గెలవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ముందుకెళ్లారు. అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు వేస్ట్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఓట్లు వేస్ట్ కాలేదు గానీ.. క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. దీనిపై జగన్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. వారిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.