లోకేష్, జగన్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?

Publish Date:Jul 9, 2026

Advertisement

వాస్తవ వేదిక.. తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పడు  కిచెన్ క్యాబినెట్,  కోటరీ అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ ఉన్న ఆ ముఠాలు ఎవరు?  గ్రౌండ్ రియాలిటీకి, ప్రజా కోణానికి వారు పార్టీల  నేతలను ఎంత దూరం చేస్తున్నారు? అనే అంశాలపై తెలుగువన్ వాస్తవ వేదికలో   జమీన్ రైతు, డోలేంద్ర  ప్రసాద్ ' తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంక్ లు విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   రాజకీయ వ్యూహకర్తలు, కోటరీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న అపకారంపై వారు కూలంకషంగా చర్చించారు. 

గతంలో  ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు వంటి అగ్రనేతలు క్షేత్రస్థాయి నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారన్న డోలేంద్ర ప్రసాద్.. ఒక సాధారణ వ్యక్తి ఎదురైనా పిలిచి మాట్లాడి రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ఓపెన్ మైండ్ నాటి ప్రధానులకు ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ తన పాత కోటరీని పక్కన పెట్టి అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ వంటి కార్పొరేట్ మైండ్స్ ఉన్న వ్యక్తులను కిచెన్ క్యాబినెట్‌లో పెట్టుకున్నారో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు డిస్కనెక్ట్ అయి తీవ్రంగా నష్టపోయిందని  ఉదాహరణలతో వివరించారు.

ఇప్పుడు ఇదే తరహా కోటరీ సంస్కృతి   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోందన్నారు డోలేంద్ర ప్రసాద్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి నమ్మకస్తులైన, రాజకీయ అనుభవజ్ఞులైన కోటరీని  జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి భూస్థాపితం చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు నాటి సీనియర్లను కాదని, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.

 కిచెన్ క్యాబినెట్లలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలిచిన అనుభవం కూడా లేదన్నారు.  ప్రజలతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎలాంటి సంబంధం లేని ఈ సరికొత్త నాయకులు కేవలం పగలు పైరవీలు, రాత్రికి డిన్నర్ పార్టీలకే పరిమితమవుతున్నారన్నారు ఇలాంటి వారి వల్ల ప్రజలకు,  నేతలకు మధ్య ఉండాల్సిన కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతోందని విశ్లేషించారు.

రాబిన్ శర్మ, ప్రశాంత్ కిశోర్, సునీల్ వంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీమ్‌లు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అపకారం చేస్తున్నాయన్నారు. వీరు  మ్యానుఫ్యాక్చర్డ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే కృత్రిమ ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియా, కంట్రోల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా లేని ప్రజాదరణను ఉన్నట్లు చూపిస్తున్నారనీ,  ఈ తప్పుడు నివేదికలను, గ్రాఫ్ లను  అధినేతలు మాత్రమే నమ్ముతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అసలైన ప్రజాభిప్రాయం వేరుగా ఉంటుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ దశలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్..  తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ,  తాను  2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు. దీనికి డోలేంద్రప్రసాద్..   రాజకీయాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ సంస్థల చేత సర్వేలు చేయించుకునే నేతలు..  నిజాయితీగా గ్రౌండ్ రియాలిటీ చెప్పే విశ్లేషకుల మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.  అధినేతలు ఇప్పటికైనా కృత్రిమ కోటరీలను పక్కన పెట్టి, ప్రజలతో మమేకమయ్యే నేతలను దగ్గరకు చేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర  నష్టాలు తప్పవని చెప్పారు. 

AP Politics, YS Jagan Coterie, Nara Lokesh Kitchen Cabinet, Political Analyst Dorendra Prasad, Teluguone MD Ravishankar, Telugu One News Political Debate

By
en-us Political News

  
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.