పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?.. పవన్ మాటల ఆంతర్యం ఏంటి?

Publish Date:Aug 19, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? పొత్తులు ఖాయం.. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయన్న హింట్ ఇచ్చారా? తెలుగుదేశంలో జనసేన ఒక్కటే కలిసి నడుస్తుందా? బీజేపీని కూడా కలుపుకుని వస్తుందా? అన్న విషయం ఒక్కటే తేలాల్సి ఉందని ఆయన చెబుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

వారాహి మూడో విడత యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి.. వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు వెళతాం అని నిక్కచ్చిగా చెప్పేశారు. పొత్తుల విధి విధానాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దీంతో మరో సారి ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు కలిసి ఎన్నికల బరిలో దిగుతారు. సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది అన్న చర్చలు జోరందుకున్నాయి. 

తెలుగుదేశం, జనసేన,బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతాయా? 2014 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తాయా? లేకపోతే.. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు కలిసి రంగంలోకి దిగుతాయా, తెలుగుదేశం ఒంటరిగానే ఎన్నికల రణరంగంలో తన సత్తా చాటుతుందా? లేక బీజేపీని వదుల్చుకుని జనసేన తెలుగుదేశంతో చేతులు కలుపుతుందా? అన్న విషయంలో సర్వత్రా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పైన అనుకున్న మూడు ఆప్షన్లకే అవకాశం ఉందని, మరి జనసేన వాటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకుంటుందో తెలియాల్సి ఉందనీ పరిశీలకులు అంటున్నారు.  రాష్ట్రంలో పొత్తల విషయంలో మొట్టమొదటిగా మాట్లాడింది జనసేనానే కావడంతో ఇప్పుడు బంతి కూడా ఆయన కోర్టులోనే ఉంది. పొత్తులు లేకుండా పోటీ చేస్తే 2019 ఫలితమే పునరావృతమౌతుందా అన్న అనుమానాలు జనసేనానిలో బలంగా ఉన్నాయనీ, వారాహి యాత్రలో ఆయన చేస్తున్న ప్రసంగాలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి రావాలని తాను అనుకుంటే చాలదనీ, ప్రజలు కూడా అనుకోవాలి అంటూ ఆయన చెబుతున్న మాటలు.. జనసేనాని ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి.  

ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారైనా సరే బీజేపీ పొత్త వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించరు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆ పార్టీతో పొత్తు ఉంటే బెటర్ అన్న భావనతో ఉంటారు. జనసేనాని మాటలను బట్టి చూస్తుంటే.. ఆయన ఉద్దేశం కూడా అదే అన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంను కలుపుకుని పోకుండా ఒక్క బీజేపీని నమ్ముకుని జనసేన ముందుకు సాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదని  పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  సాధ్యమైనంత వరకూ జనసేన తన మిత్రపక్షం బీజేపీని కూడా తెలుగుదేశంతో పొత్తులోకి తీసుకువద్దామన్న ఉద్దేశంతో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది కుదరకపోతే కమలానికి బైబై చెప్పేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో పొత్తుల విషయంలో ఒకింత బెట్టుగా వ్యవహరించి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను పొందాలన్న వ్యూహంతో జనసేనాని ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూడా  పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందనీ, తొందరపాటు అవసరం లేదనీ, అవసరమైతే ఒంటరిగానే సత్తా చాటాలన్న ఉద్దేశాన్ని చాటుతోందని అంటున్నారు.  ఇక బీజేపీ విషయంలో తెలుగుదేశం ఒక స్పష్టతతో ఉందనీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీ లోని జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ.. పొత్తుకు వస్తామంటూ తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తాన్ని చాటితే ఆ చేయి అందుకోవడానికి తాము సిద్ధంగా లేవని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ అక్రమాలు, తనపై జరిగిన దాడుల వివరాలతో రాసిన  లేఖకు అటువైపు నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే కమలం పార్టీలో పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని తెలుగుదేశం చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని నోట పొత్తలు ఖాయం.. చర్చలు జరుగుతున్నాయన్న మాట రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.