Publish Date:Nov 22, 2024
జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం దొరకడం లేదు. నలుగురు కొడుకులు తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది.
మౌలానా: జబ్బార్ భాయ్ నువ్వు కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినప్పటికీ అది నీకు చెందుతుందా? లేదా? అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతీది ఉంటుంది. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతీరూపాయి నీకే చెందుతుంది. నువ్వు పక్కవాడి భూమి కబ్జా చేసి కోట్లాది రూపాయల ఆస్తి సంపాదిస్తే మాత్రం పట్టెడన్నం కూడా కరువవుతుంది. సృష్టికి నీవేమి ఇస్తావో సృష్టి కూడా అదే ఇస్తుంది.
జబ్బార్ భాయ్: అవును మౌలానా సాబ్. నేను 40 ఏళ్ల క్రితం పక్కవాడి భూమి కబ్జా చేశాను. వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టాను. ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పి యజమానిని బుట్టలో వేసుకుని మెల్లి మెల్లిగా భూమి కబ్జా చేశాను.
మౌలానా: తెల్సు జబ్బార్ భాయ్ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు బ్యాంకులో అటెండర్ జాబ్ చేశావు. జీతం కూడా తక్కువే. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కాజేశావు. నీకు భయపడి వాళ్లు కేసు బనాయించకపోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ లో అది చెల్లుబాటు కాదు. ఆ కుటుంబానికి చెందిన వాళ్లు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో నీ భార్య మంచానపడి మరణించింది. భార్య చనిపోవడంతో నీవు ఒంటరి వాడివయ్యావు. మద్యానికి బానిస అయ్యావు. రెండో పెళ్లి చేసుకున్నావు. ఆస్తిలో వాటా వెళుతుందేమోనన్న భయంతో కొడుకులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఏ ఇంటి కోసం పక్కవాడి భూమి కబ్జా చేశావో ఆ భూమి నీకు చెందకుండా పోయింది. 40 ఏళ్ల సర్వీస్ చేసి రూపాయి రూపాయి కూడ బెట్టి బిల్డింగ్ కట్ఠినప్పటికీ జానెడు జాగా లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ కొడుకులకు అయినా ధర్మబోధనలు చేసి ధర్మం కాపాడు. ఆఖీరత్ మే జన్నత్ మిలేగా( ఖురాన్ ప్రకారం చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరడం) . ఖుదాఫీస్ జబ్బార్ భాయ్
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-you-give-39-188812.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.