జనం తిరగబడితే ఖాకీల గతేంటి?

Publish Date:Aug 26, 2022

Advertisement

ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య జనంలో సైతం తీవ్రం అసంతృప్తి పెరిగిపోతోంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ప్రజలు బహిరంగంగానే రగిలిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో  కొందరు పోలీసుల వ్యవహార శైలిపై  పెద్ద ఎత్తున , ఆగ్రహావేశాలు, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన రెండో రోజున అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ మొత్తంలో పోలీసులు 60 వేల మంది ఉంటే.. టీడీపీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారంతా వచ్చి మీ మీద పడితే ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారంటేనే పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమౌతుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి సందర్భంలో అయినా సాధారణంగా  సంయమనం కోల్పోకుండా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునే  పోలీసులు  తీరు ఇంతలా రగిలించిందంటే.. ఇక సాధారణ కార్యకర్తలు, ప్రజలలో    ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ‘టీడీపీ కార్యకర్తలను కొడితే.. మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించే దాకా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలోనే అధికార పార్టీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లినా.. టీడీపీ ఫ్లెక్సీలను చించేసినా.. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు వాళ్లకు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలపై  దాడులకు దిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. 

ఏపీలో పోలీసుల తీరు ఇంకా ఇలాగే అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉంటే.. భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడమే కాకుండా.. జనాగ్రహంలో వారు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీఐని తీరుపై విపక్షకార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. జనం నీతి నిజాయితీ ముందు ఖాకీ డ్రెస్ వేసుకుని వీరుల్లా విర్రవీగుతున్న పోలీసులు చిత్తుకాగితం లాంటి వారే అని జనం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులకు భవిష్యత్తులో అవమానాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. అసలు జనమే తిరగబడితే.. పోలీసులు తాము ఏమైపోతామనేది ఊహించుకోవాలని అంటున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.