Publish Date:Aug 26, 2022
ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య జనంలో సైతం తీవ్రం అసంతృప్తి పెరిగిపోతోంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ప్రజలు బహిరంగంగానే రగిలిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కొందరు పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున , ఆగ్రహావేశాలు, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన రెండో రోజున అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ మొత్తంలో పోలీసులు 60 వేల మంది ఉంటే.. టీడీపీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారంతా వచ్చి మీ మీద పడితే ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారంటేనే పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమౌతుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి సందర్భంలో అయినా సాధారణంగా సంయమనం కోల్పోకుండా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునే పోలీసులు తీరు ఇంతలా రగిలించిందంటే.. ఇక సాధారణ కార్యకర్తలు, ప్రజలలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ‘టీడీపీ కార్యకర్తలను కొడితే.. మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించే దాకా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలోనే అధికార పార్టీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లినా.. టీడీపీ ఫ్లెక్సీలను చించేసినా.. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు వాళ్లకు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు.
ఏపీలో పోలీసుల తీరు ఇంకా ఇలాగే అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉంటే.. భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడమే కాకుండా.. జనాగ్రహంలో వారు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీఐని తీరుపై విపక్షకార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. జనం నీతి నిజాయితీ ముందు ఖాకీ డ్రెస్ వేసుకుని వీరుల్లా విర్రవీగుతున్న పోలీసులు చిత్తుకాగితం లాంటి వారే అని జనం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులకు భవిష్యత్తులో అవమానాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. అసలు జనమే తిరగబడితే.. పోలీసులు తాము ఏమైపోతామనేది ఊహించుకోవాలని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-will---police-do-if-people-revolt-39-142701.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది