అమ‌రావ‌తిపై వాట్ నెక్ట్స్‌?.. డైలమాలో జగన్ సర్కార్!

Publish Date:Mar 4, 2022

Advertisement

కింకర్తవ్యం.. ఏమిటి చేయడం? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న ఇది.రాష్ట్ర రాజధాని విషయంలో, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కార్ ‘ కు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. నిజమే, ఇలాంటి తీర్పు ఏదో వస్తుందనే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముందుగానే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహిరించుకుంది. సీఆర్డీఏ చట్టాన్ని కోర్టు గడప దాటించే ప్రయత్నం చేసింది. కానీ, కుదరలేదు. ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకోవడం వెనక ఉన్న ఉద్దేశాలను హైకోర్టు గుర్తించింది. సర్కార్ వెనకడుగు వేసింది, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఫై మరింత బలంగా పంజా విసిరేందుకే అనే నిజాన్ని, సర్కార్ నైజాన్ని న్యాయస్థానం గ్రహించింది. నిజానికి అందులో దాపరికం ఏమీలేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు ఎవరి భాషలో వారు, చట్టాన్ని వెనక్కి తీసుకున్నా మూడు రాజధానుల సంకల్పం మారలేదని చెపుతూనే ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులకు తమ ప్రభత్వం కట్టుబడి ఉందని, వాదిస్తూనే వచ్చారు. చివరకు, కోర్టు సమర్పించిన అఫిడవిట్’లోనూ అదే విషయం బ్లాక్ అండ్ వైట్’లో చూపించారు. అందుకే, ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్నా, న్యాయస్థానం అదే చట్టం పై రైతులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ కొనసాగించి, సహజ న్యాయానికి దగ్గరగా ఉండే సంచలన తీర్పును ఇచ్చింది.తాజా తీర్పులో రాష్ట్ర హై కోర్టు, సర్కార్ దృఢ /దృష్ట సంకల్పం అడుగులు ముందు పడకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేసింది.నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. ఇంకా గట్టిగా, స్పష్టంగా చెప్పాలంటే చెంప దెబ్బ అంటున్నారు విశ్లేషకులు.  

అదలా ఉంటే, ఈ చిక్కులలోంచి బయట పడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సహా అనేక ప్రత్యాన్మాయాలను అలోచిస్తునట్లు తెలుస్తోంది. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని విషయంలో ఇప్పటికే పీకలలోతుకు మునిగిపోయింది, తనకు తానుగా సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడడం అయ్యే పని కాదని న్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని అన్నిపక్కల నుంచీ కట్టడి చేసిందని అంటున్నారు.  

భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆరునెలల్లో మాస్టర్ ప్లాన్ అమలు పూర్తిచేయాలనీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, కనీసావసరాలు తీర్చడం నెలరోజుల్లో జరగాలని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరచిన ప్లాట్లు మూడునెలల్లో అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇస్తుండాలని నిర్దేశించింది. అంటే ఒక విధంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని గట్టిగా కట్టి పడేసిందని అనుకోవచ్చునని అంటున్నారు.  

నిజమే, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొందరు మంత్రులు ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని పాత పాటనే మళ్ళీ ఎత్తుకున్నారు. అలాగే, రాష్ట్ర హై కోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళతామని ప్రకటించారు. నిజానికి, ఇది దింపుడు కళ్ళెం ఆశా లేక నిజంగా అలాంటి ఆవకాశం ఉందా? అంటే న్యాయనిపుణులు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, వెళ్ళక పోయినా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా ఎలాంటి ఊరట ఉండక పోవచ్చనే అంటున్నారు. అందుకే కావచ్చును ప్రభుత్వం కూడా, తుది నిర్ణయం విషయంలో కిందా మీదా అవుతోందని అధికార వర్గాల సమాచారంగా వుంది.  

ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడు ముక్కలాటను ఇష్టా రాజ్యంగా నడిపించింది. దాదాపు 800 రోజులకు పైగా విభిన్న రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులను, మహిళలను అనేక విధాల వేధింపులకు గురిచేసింది. అయినా,  చివరకు కోర్టు తీర్పురూపంలో ధర్మం జయించింది. 
అందుకే, ఇప్పటికైనా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం,అధికార పార్టీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల మంకు పట్టును వదిలి కోర్టు తీర్పును గౌరవించడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు. గత రెండున్నరేళ్ళుగా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో, రాజధాని నిర్మాణం అడుగు ముందుకు సాగలేదు. రాష్ట్రం రాజధాని లేని అనాధగా మిగిలిపోయింది. ఈనేపధ్యంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపించినా, నిజానికి అది ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు కాదు. ఇంకా మాట్లాడితే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి హై కోర్టు ఒక సువర్ణ అవకాశం కలిపించింది. ఇక ఈ అవకాశాన్ని. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇపుడు జగన్ రెడ్డి చేతిలోనే వుంది. ఎప్పటిలా మొండికి పోతే, రాష్ట్రం తీవ్రం నష్టపోతుందని అంటున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.