బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీని పురస్కరించుకుని తెలుగుదేశం, బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలను తోసి పుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని కుండ బద్దలు కొట్టేశారు.
గతంలో కూడా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని, హోంమంత్రితో భేటీ అయిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్రంలో మోడీ సర్కార్ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెలాఖరు వరకూ నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చేందుకు బండి సంజయ్ తెలంగాణలోని వివిధ జిల్లాల పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా, నడ్డాలతో భేటీ నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం పొత్తులపై మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. ఊహాజనిత వార్తలను పట్టించుకోనవసరం లేదన్న బండి సంజయ్ దేశ సమగ్రాభివ్రుద్దే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. మమతా బెనర్జీ, స్టాలిన్ ఆఖరకి కేసీఆర్ తో కూడా గతంలో మోడీ, షా భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మరో వైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు అమిత్, షా నడ్డాలతో భేటీని భూతద్దంలో చూస్తూ ఖంగారు పడుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం పిలుపుపై చంద్రబాబు హస్తిన వెళ్లిన సంగతిని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ.. బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ కథనాలను వండి వారుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం మాత్రం ఈ భేటీపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు హస్తినలో అమిత్ షాతో మాట్లాడారని అంటోంది. మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటన ఇటు ఏపీలోనే కాకుండా, అటు తెలంగాణలో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-wrong-25-156334.html
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ వున్నారా? అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముందస్తుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సోషల్ మీడియాలో బాగానే ముందస్తు ఎన్నికలపై చర్చ అయితే జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు.
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 4) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది.
బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.