మునుగోడులో టీఆర్ఎస్ వ్యూహం అదేనా?

Publish Date:Aug 10, 2022

Advertisement

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అవసరం లేని తలనొప్పి వచ్చి పడింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు. అక్కడ ఏ పార్టీ గెలిచినా టీఆర్ఎస్ కు ఒరిగేది కానీ, పోయేది కానీ ఏముండదు. అయినా అనివార్యంగా  ఆ ఉప ఎన్నికను ప్రతిష్ఘాత్మకంగా తీసుకోవలసిన అవసరం తన్ను కొచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగనున్న ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తేనే రాష్ట్రంలో తమ సత్తా ఏ మాత్రం తగ్గలేదని చాటుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఫలితం వస్తే.. ఇంత కాలంగా టీఆర్ఎస్ పనై పోయింది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అంటూ బీజేపీ  చేస్తున్న ప్రచారానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రచారమే వాస్తవమా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో ప్రబలే ప్రమాదమూ ఉంది. పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలు ఇలా ఉంటే.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన మాత్రం వేరేలా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక జస్ట్ ఉప ఎన్నిక అంతే అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ.. టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా కేటీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆస్క కేటీఆర్ అన్న కార్యక్రమంలో నెటిజన్లతో భేటీ సందర్భంగా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చిదీ, పోయేదీ ఏం ఉండదు అని వ్యాఖ్యానించారు. మునుగోడులో విజయం కోసం టీఆర్ఎస్ ఏ మంత సీరియస్ గా ప్రయత్నించడం లేదని చాటేందుకే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అలా మాట్లాడారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అసలీ ఉప ఎన్నికపై కంటే కేసీఆర్ దృష్టి అంతా ఆ తరువాత రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని వారంటున్నారు.

ఆ ఎన్నికల్లో  విజయం కోసమే ఆయన ఇప్పటి నుంచీ వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేననీ, దానికి తమ అధినేత కేసీఆర్ కూడా గుర్తించారనీ అంటున్నారు. అయితే ఆయన అంచనా ప్రకారం టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఒకే పార్టీకి పడితేనే టీఆర్ఎస్ కు కష్టమనీ, అలా కాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థుల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే  పార్టీ విజయం సునాయాసమని ఆయన భావిస్తున్నారు.

పార్టీ ప్రత్యర్థుల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే మునుగోడు ఉన ఎన్నికను పెద్దగా సీరియస్ గా తీసుకోనవసరం లేదంటున్నారు. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో బీజేపీ పరువు తీయడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. హస్తిన స్థాయిలో చక్రం తిప్పి మరీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా మునుగోడు ఉప ఎన్నికకు మార్గం సుగమం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేసీఆర్ తన మంత్రివర్గ సహచరుల వద్ద, పార్టీ ముఖ్యుల వద్దా చెప్పినట్లు టీఆర్ఎస్ శ్రేణుుల చెబుతున్నాయి.

జాతీయ స్థాయిలో బీజేపీకి దిమ్మ తిరిగేలా మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయం పాలయ్యేలా ఎత్తులు వేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కాంగ్రెస్ కు మద్దతు నిచ్చి ఆ పార్టీని గెలిపిస్తే బీజేపీకి గాలి తీసేసినట్లౌతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిశీలకులు కూడా పోటీ పడి ఓడిపోయి హుజూరాబాద్ లో భంగపడిన దాని కంటే.. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఊతం ఇచ్చి.. బీజేపీని ఓడించడం వల్లే రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం టీఆర్ఎస్ కు ఉంటుందని అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికను కలిసి వచ్చిన అవకాశంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు కచ్చితంగా కాంగ్రెస్ కు కంచుకోట. అక్కడ బీజేపీకి గానీ, టీఆర్ఎస్ కు గానీ పెద్దగా పట్టు లేదు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ అక్కడ ఉప ఎన్నికలో లబ్ధి పొందేలా పథక రచన చేసి అమలు చేస్తోంది. ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉందంటున్నారు.

బీజేపీకి రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటున్నంతగా బలం కానీ, ప్రజాభిమానం కానీ లేదని చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికను సాధనంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే మునుగోడులో కాంగ్రెస్ కు ఇప్పటికే గట్టి  ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా కారణంగా అక్కడ తగ్గిన ఓటును తన మద్దతు ద్వారా కాంగ్రెస్ కు అందేలా చేస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ కు అది ఎటూ సిట్టింగ్ సీటు కాకపోవడం వల్ల కాంగ్రెస్ విజయం సాధిస్తే.. బీజేపీది బలం కాదు వాపు మాత్రమే అని చాటేందుకు పనికి వస్తుంది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎటూ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు చీలి తమ విజయం ఖాయమౌతుందన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మునుగోడు విజయంతో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. అప్పుడు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక భారీగా ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.   మునుగోడు ఉప పోరును పూర్తిగా బీజేపీ- కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరుగా మారితేనే టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం లేదనీ, అదొక ఉప ఎన్నిక అంతేనని కేసీఆర్ వ్యాఖ్యానించారంటున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.