Publish Date:Mar 17, 2025
ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని మనం అభివర్ణిస్తుంటాం. కానీ ఇరాన్ లో బ్లడ్ రెయిన్ వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. సాధారణంగా వర్షపు నీరు స్వచ్చంగా ఉంటుంది. కానీ ఇరాన్ లోని రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షం నీరు ఎర్రటి రంగులో ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త టాప్ టెన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధించారు. ఇరాన్ రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షానికి ఎలాంటి రంగులేదని పరిశోధకులు తేల్చేశారు. ప్రపంచంలోని ఏడో వింత అని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాజాగా రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షాన్నిఅక్కడి జనం ఎంజాయ్ చేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రపంచనలుమూలల నుంచి అక్కడికి చేరుకున్నారు. బ్లడ్ రెయిన్ వార్త తెలుసుకుని ఇరాన్ బీచ్ లో ప్రత్యక్ష మయ్యారు. ఇరాన్ లో రెయిన్ బో ఐల్యాండ్ లో ఆకాశం నుంచి వర్షపు నీరు పడి జలపాతంలా క్రిందకు దూకడంతో అద్భుతమైన దృశ్యం పలువురిని ఆకర్షించింది. రెయిన్ బో ఐ ల్యాండ్ లో అగ్ని పర్వతం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పర్వతం బద్దలు కావడంతో ఆ ప్రాంతమంతా ఐరన్ ఆక్సైట్ కంటెంట్ తో నిండిపోయింది. వర్షం పడినప్పుడు చిలుముతో నిండిన ఐరన్ మీద వర్షపునీరు పడటంతో అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది.
ఎర్రటి రంగులో ఈ నీరు ప్రవహించడంతో బ్లడ్ రెయిన్ అనే ప్రచారం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-reason-for-the-blood-rain-in-iran-25-194516.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.