ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి?

Publish Date:May 26, 2023

Advertisement

అత్యాధునిక సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతే సర్వాంగ సుందరంగా సిద్దమైంది. మరో రెండు రోజుల్లో,  అంటే మే 28 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారు. సరే ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి అంటే తెలియదు. ఎందుకంటే ఆ భవనానికి ఇంకా నామకరణం జరగలేదు. కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరునూ కేంద్రం ఖరారు చేయలేదు.

అయితే  ఏ పేరు పెట్టినా అదొక వివాదంగా మారుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నగరాల, పట్టణాల పేర్లకు హిందుత్వ వాసనలు అద్దుతున్న నేపద్యంలో పార్లమెంట్ పేరులోనూ అవే వాసననలు గుబాళిస్తే   లౌకికవాద పార్టీలు పార్లమెంట్ ను ప్రధాని ప్రారంభించడాన్ని రచ్చచేస్తున్న రీతిలోనే మరింతగా రచ్చచేయవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు ఏ పేర్లు పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

మరోవంక నూతన పార్లమెంట్ భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా ప్రముఖుల విగ్రహాలు ఉంటాయని  చెబుతున్నారు. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట. ఈ ప్రవేశ ద్వారాలకు చారిత్రక అంశాలను మేళవించారట. వాటికి జ్ఞాన ద్వారం..శక్తి ద్వారం.. కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు.

జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు ఉండనున్నాయి. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.  

కేంద్ర ప్రభుత్వం 2022  సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది.  ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే పార్లమెంట్ హౌజ్ అని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఏ పేరునూ ఖరారు చేయలేదు. మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సెంగోల్  స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు.  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.

By
en-us Political News

  
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.