ఆర్ఎస్ఎస్ లోనూ మంచివాళ్లు.. మమత మాటల వెనుక మర్మమేంటి?

Publish Date:Sep 2, 2022

Advertisement

బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయా?  మోడీ, షా ద్వయం ఆధిపత్య ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోందా? ఆ వ్యతిరేకత ఒక్కసారిగా బట్టబయలు అయ్యేందుకు పిల్లి మెడలో గంట కట్టేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధమయ్యారా? నితిన్ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా గళమెత్తితే ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ సై అంటున్నాయా? వెనకుండి ఇంత కాలం బీజేపీకి మెంటార్ గా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ కూడా నితిన్ గడ్కరీకే మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉందా? ఒక్క వ్యక్తి తెగించి ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడితే.. ఆయనకు అండగా వెనుక నిలవడానికి ఇంత మందీ సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానమిస్తున్నారు.

బీజేపీని ఇతర మూస రాజకీయ పార్టీల నుంచి ఇంత కాలం ప్రత్యేకంగా నిలుపుతున్న విధానాలన్నిటికీ మోడీ తిలోదకాలిచ్చేశారనీ, గతంలో కాంగ్రెస్ ను ఏ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారో, ఇప్పుడు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవే విధానాలను అవలంబిస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు కమలం పార్టీలోనే వ్యక్తమౌతున్నది. అధికారం చాలు ఇంకే విలువలూ అక్కర్లేదన్న చందంగా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తోందన్న భావన పార్టీలో వ్యక్తమౌతున్నది. దానినే గడ్కరీ ఇటీవల ఒక సమావేశంలో ఒకింత ఉద్వేగ పూరితంగా వ్యక్తం చేశారు.

అది మొదలు బీజేపీలో గడ్కరీ నేతృత్వంలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రంగం సిద్ధమైందన్న చర్చ ప్రారంభమైంది. రోజు రోజుకూ ఆ చర్చ తీవ్ర తరమౌతున్నది. నాగపూర్ (ఆర్ఎస్ఎస్) తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీకే ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చింది. పార్టీలో  మోజారిటీ సభ్యులు గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానాలు చేశారు.  గడ్కరీ రాజకీయమంటే అధికార దాహమేనా అంటూ వ్యాఖ్యనించిన అనంతరం ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం గల్లంతైంది. దీంతో గడ్కరీ పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. రాజకీయాలలో విలువల గురించి మాట్లాడితే.. పక్కన పెట్టేస్తారా అన్న చర్చా మొదలైంది. బీజేపీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటరీ బోర్డులో గడ్కరీ స్థానం కోల్పోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

 మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. మోడీ, షా ద్వయం పార్టీలో ఎవరినీ సొంతంగా ఆలోచించడానికి కానీ, స్వతంత్రంగా పని చేయడానికి కానీ అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి పార్టీలో గూడు కట్టుకుని ఉన్నాయనీ, అయితే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించకపోవడంతో కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రిగా, మోడీ విధానాలలోని లోపలను ఎత్తి చూపగలిగే ధైర్యం ఉన్న నాయకుడిగా పేరొందిన ఒకే ఒక్కడినీ కూడా  పొమ్మనకుండా పొగపెట్టేందుకు రంగం సిద్ధమైందని పార్టీ శ్రేణులకు సైతం అవగతమైంది.

గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నేటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు.

పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పించిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

గడ్కరీ తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఆయనతో గొంతు కలిపేందుకు పార్టీలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఖాళీ అయిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా గడ్కరీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తీరు పట్ల మోడీ షా ద్వయం వ్యవహార తీరును గతంలో పలుమార్లు గడ్కరీ తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన విషయంలో మోడీ షా ద్వయం వ్యవహరించిన తీరును గడ్కరీ వ్యతిరేకించారని అంటున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసం వెంపర్లాట మాత్రమే కాదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే.

ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీలో గడ్కరీ  కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ కాదని అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది.

ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీకీ పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయచడానికి మోడీ షా ద్వయం ప్రయత్నించడంపై పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలు కూడా గడ్కరీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. మోడీ షాలకు వ్యతిరేకంగా ఆయన నిలబడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో కూడా ఉత్తములు ఉన్నారనీ, అందరినీ రాక్షసులంటూ ఒకే గాటల కట్టేయడం సరి కాదనీ  మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు సంకేతం. ఆమె పరోక్షంగా గడ్కరీకి మద్దతుగా మోడీషాకు వ్యతిరేకంగా బీజేపీలో తిరుగుబాటు అంటూ జరిగితే తాను గడ్కరీకి మద్దతుగా నిలుస్తానని చెప్పకనే చెప్పారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మమత వంటి కరుడుగట్టిన మోడీ వ్యతిరేకులకు గడ్కరీ నమ్మదగిన నేతగా కనిపిస్తున్నారు. నేడు  మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టగలిగిందంటే అందుకు వాజ్ పేయి, అద్వానీ, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయులు వేసిన పునాదులే కారణమని గడ్కరీ నిర్ద్వంద్వంగా చెప్పారు. అంతే కాదు ఆ సందర్బంగా గతంలో వాజ్ పేయి చేసిన చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందన్న ప్రసంగాన్ని ఉటంకించారు. గడ్కరీ వ్యాఖ్యల వెనుక ప్రస్తుత పరిస్థితులు మారుతాయనీ త్వరలోనే మార్పు తప్పదనీ, ఆ మార్పు తన నాయకత్వంలోనే మొదలౌతుందన్న సంకేతం కూడా గడ్కరీ మాటల వెనుక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

 రాత్రికి రాత్రి మహారాష్ట్రలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకించారు.  అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో  రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలను కూలదోసైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి మోడీ, షా ద్వయం వేస్తున్నఎత్తులను,    పన్నుతున్నవ్యూహాలను గడ్కరీ వ్యతిరేకిస్తున్నారనీ, మోడీ, షా ద్వయం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని గడ్కరీ  సన్నిహితులు అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీ, షాలేనని అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గడ్కరీ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెంట నడవడానికి బీజేపీలోని ఒక బలమైన వర్గమే కాదు. గడ్కరీ మద్దతుగా నిలవడానికి పలు  బీజేపీ యేతర పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు మమతా బెనర్జీ వ్యాఖ్యలే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ గడ్కరీ నాయకత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి. అలాగే ఇప్పటికే ఎన్డీయేను వీడి వెళ్లిన పార్టీలు కూడా గడ్కరీ నాయకత్వంలో పని చేయడానికి సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే  మోడీని గట్టిగా వ్యతిరేకించే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు గడ్కరీ నాయకత్వంలో బీజేపీలో కనుక చీలిక వస్తే   గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సదా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే గడ్కరీ తన అసమ్మతి గళాన్ని మరింత గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తాజాగా మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ లోనూ మించి వారున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా గడ్కరీని ఉద్దేశించి చేసినవేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గడ్కరీ అడుగు ముందుకు వేయడమే తరువాయి.. జాతీయ స్థాయిలో ఒక సరి కొత్త రాజకీయ సమీకరణకు తేరలేస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు.

By
en-us Political News

  
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.