షా సభ వాయిదా .. పొంగులేటి సైలెన్స్.. లింకేంటి?

Publish Date:Jun 16, 2023

Advertisement

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... ఖమ్మం సభ రద్దయింది. సరే అది అసలు కారణం అయినా కాకున్నా, బిఫర్ జాయ్ తుపాను కమ్ముకొస్తున్న కారణంగానే అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన, ఖమ్మం సభ రద్దయ్యాయని బీజేపీ చెపుతున్న కారణం కొంత సహేతుకంగానే వుంది. కానీ, ఓ వంక మాజీ ఎంపీ పొంగులేటి ప్రహసనం నడుస్తున్న సమయంలో  ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని మీడియా కథనాలు వండి వరుస్తున్న సమయంలో, అమిత్ షా పోయి పోయి ఖమ్మంలో సభ పెట్టడమే, ఓ పెద్ద పజిలింగ్  ప్రశ్న అయితే  ఆ సభ రద్దు కావడం దానితో పాటుగా పొంగులేటి సైలెంటైపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. 

నిజానికి, బీఆర్ఎస్  నుంచి సస్పెండ్  అయి నప్పటి నుంచి  ఇంకా మాట్లాడితే అంతకు ముందు నుంచీకూడా పొంగులేటి, ఆయనతో పాటుగా బీఆర్ఎస్  నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, వార్తల్లో వ్యక్తులుగా ప్రచారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆ ఇద్దరూ అందుకు తగిన వేదిక ఏది? కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీలో చేరితే తమ లక్ష్యం నెరవేరుతుంది? అనే దిశగా సమాలోచనలు  జరుపుతున్నారు. అలాగే తమవంటి  బీఆర్ఎస్ బాధితులను చేరదీసి కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేశారు.

అదే సమయంలో ఇటు కాంగ్రెస్  అటు బీజీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆ ఇద్దరికీ, రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు పోటాపోటీ ప్రయత్నాలు సాగించారు. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేశారు. చివరాఖరుకు ఆ ఇద్దరు కాంగ్రెస్ చేరుతున్నారని మీడియా మేథావులు నిర్ణయానికి వచ్చారు. ముహూర్తం ఖరారు చేశారు..చివరకు పొంగులేటి, జూపల్లి కూడా  జూన్ 13 న తమ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలతో ఆఖరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, 14న హైదరాబాద్ లో మీడియా సమవేశంలో తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, అది జరగ లేదు. ఎందుకు? ఇప్పుడు ఇదే ప్రశ్న మీడియా మేథావుల బుర్రలు తొలిచేస్తోంది. 

అమిత్ షా సభ వాయిదాకు, పొంగులేటి, జూపల్లి ప్రెస్ మీట్ వాయిదాకు లింక్ వుందా ..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖరారు అయిందే నిజం అయితే, ఆ ఇద్దరు ప్రకటించిన విధంగా జూన్ 14న మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది.

అయితే , నిజానికి పొంగులేటి మొదటి నుంచి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే, ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం  కేసులో చలనం లేక పోవడం, మరో వంక అంతవరకు బీజేపీపై ఒంటి కాలుపై లేచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్,  బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు  సైలెంట్ అయిపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందనే అనుమానాలు వ్యక్తం కావడం, అదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అదించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో పొంగులేటి పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరిగింది. 

కానీ, రేపటి ఎన్నికల్లో గెలిచినా, గెలవక పోయినా... బీఆర్ఎస్  ఎదుర్కునే సత్తా...బీజేపీకి మాత్రమే ఉందని,అందుకే ఆ ఇద్దరు.. ముఖ్య్మగా పొంగులేటి  చివరకు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని, అందుకే పొంగులేటి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. అయితే, చివరకు కండువా కప్పుకునే వరకు.. ..ఆ ఇద్దరు ..ఏ పార్టీలోకి అన్న సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.