అమరావతికి రైల్ కనెక్టివిటీ దేనికి సంకేతం?

Publish Date:Mar 10, 2023

Advertisement

అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని. 2015లో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి విజన్ తయారు చేశారు. రైతులను ఒప్పించి 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు.  అమరావతిలో రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు.

చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర డిజైన్లు ఆహా అనిపించాయి.  దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని రాష్ట్ర ప్రజలు భావించారు. తమ కలల రాజధాని కల సాకారం అవుతున్న దన్న ఆనందం రాష్ట్ర ప్రజలలో వ్యక్తమైంది. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల అనంతరం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి అమరావతి ప్రభ మసకబారింది. అప్పటి వరకూ  కళకళలాడిన అమరావతి బోసిపోయింది. జగన్ సర్కార్ అక్కడ  కొనసాగుతున్న నిర్మాణాలను ఆపేసింది.  జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు.. వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మిగిలిపోయాయి.  

రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో.. అవి  పూర్తిగా పాడైపోయాయి. రోడ్లను తవ్వి కంకర కూడా దోచుకెళ్లారు దుండగులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ సర్కార్ విశాఖ రాజధాని అంటూ అమరావతికి కనెక్టివిటీకి ప్రతిపాదించిన  రైల్వే ప్రాజెక్టులను పట్టించుకో కపోయినా.. ఇప్పుడు రైల్వే శాఖ  ఆ ప్రాజెక్టులను సొంతంగానే చేపట్టాలని నిర్ణయించింది.   అమరావతి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టును   తెరపైకి తెచ్చింది. విజయవాడ బైపాస్‌ రైల్వేలైన్‌ కింద దీన్ని రైల్వే శాఖ నిర్మించనుంది. తెలుగుదేశం హయాంలో కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్‌ కేటాయించారు. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు.  విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు.  2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

అయితే అదంతా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడిపోయింది.  ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అమరావతికి  కనెక్టివిటీని పెంచేందుకు రైల్వే శాఖ నడుంబిగించింది. అమరావతి విషయంలో కేంద్రం ఇటీవల పార్లమెంటులో, కోర్టుకు ఇచ్చిన నివేదికలో  అమరావతికి అనుకూలంగా కేంద్ర స్పందించడం, ఇప్పుడు రైల్వే శాఖ అమరావతి కనెక్టివిటీ విషయంలో అడుగు ముందుకు వేయడంతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికీ జగన్ అమరావతి కాదు అనే అంటున్నారు. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా త్వరలో తాను విశాఖ నుంచి పాలన సాగించబోతున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా జగన్ ఇలా ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్న, మరో వైపు జగన్ ఇలా ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న వాదన ఉన్నాయి.

అయినా వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇటీవల పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందనీ, దానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ చెబుతున్నట్లుగా మూడు రాజధానులు, అమరావతి నుంచే పాలన సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కేంద్రం ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి రైల్వే కనెక్టివిటీ విషయంలో రైల్వే శాఖ ఒక అడుగు ముందుకు వేయడం శుభపరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.