దీర్ఘాయుష్మాన్ జపాన్..

Publish Date:Jul 31, 2020

Advertisement

తొమ్మిది పదుల వయసు దాటినవారు 20లక్షలకు పైగా

సగటు జీవన ప్రమాణం 85ఏండ్లు

ఆహారపు అలవాట్లే దీర్ఘాయుష్ కు కారణం

స్వచ్ఛత, శుభ్రత వారి దినచర్యలో భాగం

అగ్ర రాజ్యాలను, అభివృద్ధి చెందిన దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ జపాన్ లో పెద్ద ప్రభామేమీ చూపలేదు. వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచదేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. అయితే వయోవృద్ధుల జనాభా ఎక్కువ ఉండే జపాన్ ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో అని ఆందోళన ఏర్పడింది. అయితే జపాన్ మాత్రం చాలా త్వరగానే కోవిద్ 19ను అరికట్టగలగడంతో పాటు తమ దేశ సంపదగా భావించే వృద్ధులను రక్షించుకుంది. అయితే అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కరోనా విజృంభిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది జపాన్ ప్రజల జీవనవిధానం.

మనిషి సగటు జీవన ప్రమాణం అత్యధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ది రెండో స్థానం. సగటు జీవన ప్రమాణం 89 ఏండ్లతో మొదటిస్థానం మొనాకో దేశానిది. జనాన్ లో 90ఏండ్లు పై బడిన వారి సంఖ్య 20లక్షలకు పైనే. వారిలో శతాధిక వృద్ధుల సంఖ్య  దాదాపు 69,785. అంటే సగటు జీవన ప్రమాణాల కాలం 84.2 ఏండ్లు. పురుషుల జీవన ప్రమాణ కాలం 81.1 ఏండ్లు కాగా, మహిళల జీవన ప్రమాణ కాలం ఇంకాస్త ఎక్కువగా అంటే 87.1 ఏండ్లుగా ఉంది.

జపానీయుల ఆహారపు అలవాట్లు జీవనవిధానం ప్రపంచాన్ని ఎప్పుడు  అబ్బురపరుస్తూనే ఉంది. వారి దీర్ఘాయుష్ పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. జన్యుపరంగా ఎక్కువ కాలం జీవించడం అక్కడ మాములే అనుకుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన చాలా అధ్యాయాలు వారి జీవనవిధానం, ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశాయి.

జపాన్ ప్రజలు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు తాజా కూరగాయలు,  సీజనల్ గా లభించే పండ్లు తప్పక తింటారు. అంతేకాదు ప్రాసెసింగ్ చేసిన, ప్యాకెట్స్, టిన్స్ లోని ఆహారాన్ని వారు అసలు ఇష్టపడరు. అంతేకాదు జపానీయుల ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఇష్టంగా తీసుకుంటారు. అందుకే చేపల వినియోగంలో ప్రపంచంలో ఆరవ స్థానంలో జపాన్ ఉంది. మాంసంలో కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 36 శాతం గుండె సంబంధిత మరణాలను ఇది తగ్గిస్తుంది.

ప్రతి సంవత్సరం దాదాపు లక్ష టన్నుల సముద్రపు నాచు(సీవుడ్)ను ఆహారంగా తీసుకుంటారు. ఒక కప్పు సముద్రపు నాచులో 2 -9 గ్రాముల ప్రోటీన్ తో పాటు సహజ సిద్ధంగా దొరికే అయోడిన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు రావు.  దీనికి తోడు వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి మరో కారణం ఆహారాన్ని మితంగా తీసుకోవడం.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అక్కడి ప్రజల్లో స్థూలకాయం సమస్య చాలా తక్కువ. ప్రపంచంలోని అధిక బరువు ఉన్నవారిలో జపానీయుల సంఖ్య కేవలం 3.6శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఇదే చాలా తక్కువ. 

జపాన్ ప్రజల జీవన ప్రమాణ కాలం ఎక్కువగా ఉండటానికి మరో కారణం ఎక్కువగా చాయ్ తాగటం. సహజంగా కాఫీ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాయ్ లోనే ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటూ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.

జపాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది. మిగతా వాటితో పోల్చితే 70 శాతం ఆరోగ్యంపైనే ఖర్చు చేస్తుంది. 

మిగతా దేశాల వాళ్ళతో పోల్చితే జపనీయుల ఎత్తు కాస్త తక్కువే.   శరీర నిర్మాణం కూడా ఒక అడ్వాంటేజ్. దీంతో చురుగ్గా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియ విధానం సక్రమంగా జరుగుతుంది. ఆఫీసుకు వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళడమో లేదా సైకిల్ మీద వెళ్ళటానికే ఇష్టపడతారు. జపాన్ లోని వయోవృద్ధులు సాధ్యమైనంత వరకు శారీరక శ్రమలో భాగస్వాములు అవుతూ ఉంటారు.

ఆరోగ్యంగా ఉండటానికి మరో కారణం 85 శాతం మంది జపనీయుల రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేస్తారు. నిద్రించే ముందు వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే మలీనాలు సులభంగా వెళ్లిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఒత్తిడిని కూడా  దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వీటన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం జపనీయులు తమ ఆచారా వ్యవహారాలను తప్పక పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. మన దేశంలో పిల్లలను సంపదగా భావస్తాం. జపాన్ లో పెద్దవారిని సంపదగా భావిస్తారు. వయోవృద్ధుల  నుంచి ఎన్నో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే స్వచ్చత, శుభ్రత నేర్పిస్తారు.

మితంగా తింటూ అమితంగా పెద్దలను, సంస్కృతిని గౌరవించడమే జపానీయుల ఆరోగ్య రహాస్యమని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.