పేర్ని నాని ఫ్యూచర్ ఏంటో?

Publish Date:May 4, 2022

Advertisement

పేర్ని నాని.. ఏపీలో తాజా మాజీ మంత్రి.. రవాణా, సమాచార శాఖలు నిర్వహించారు.మూడేళ్లు మంత్రి పదవిని అనుభవించారు. సీఎం జగన్ కోరిక మేరకు ఒక్కసారిగా మాజీగా మారిపోయారు. మంత్రి పదవిలో ఉన్నంత కాలం నానిలో మంచి చమత్కారే కనిపించాడు. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కాస్త వాస్తవాన్నీ.. మరికాస్త వ్యంగ్యాన్ని జోడించి జవాబులిచ్చేవారు. అయితే.. చేతిలో పవర్ పోవడంతో ఆయన ఇప్పుడు కోరలు పీకేసిన పాము మాదిరిగా అయిపోయారంటున్నారు. తనను పదవి నుంచి పీకేయడంతో పేర్ని నాని అలిగిన వైనం స్పష్టంగా బయటపడకపోయినా.. మౌనం అయితే వహించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నియోజకవర్గానికి వస్తే.. పేర్ని నాని ఆయన పర్యటన దరిదాపుల్లోకి రాకపోవడం అందరి దృష్టికీ వచ్చింది.

పేర్ని నాని తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విఫ్ గా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో 16 వేలకు పైబడి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నానికి 59 వేల 403 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఎన్నికలు వచ్చే సరికి పేర్ని నాని మళ్లీ పుంజుకుని మచిలీపట్నం నుంచే సుమారు 6 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పైనే గెలిచారు. అప్పుడాయనకు 66 వేల 141 ఓట్లు వచ్చాయి.

పేర్ని నాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన సామాజికవర్గానికే చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాగా విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. బీజేపీని ప్రేమిస్తూ.. చంద్రబాబుకు కన్నుకొడుతున్నారంటూ.. పవన్ మాటలు మారుస్తారని, నిలకడ లేని రాజకీయ నేత అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కారని ఘాటు విమర్శలు చేశారు. అలాగే ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న టీడీపీ పైనా పేర్ని నాని ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు గుప్పించారు.

మచిలీపట్నం నియోజకవర్గం ఓటర్లలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. పేర్ని నాని సామాజికవర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. కొన్ని గ్రామాల్లో అయితే.. కాపులదే పైచేయి. అయితే.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల కారణంగా ఆ సామాజికవర్గం ఓటర్లు పేర్ని నానిపై ఈ సారి బాగా గుర్రుగా ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక పేర్ని నానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారట. ఇక మచిలీపట్నంలో నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గతంలో మంచి మెజార్టీతోనే నెగ్గారు. ఈ సారి మళ్లీ మచిలీపట్నంలో టీడీపీకే మెజార్టీ ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక పక్కన పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా కామెంట్లు చేయడం, మరో పక్కన ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సంఖ్యలో బీసీ సామాజికవర్గాలు ఉండడం కూడా పేర్ని నానికి ఈ సారి విజయావకాశాలు తగ్గిపోయే చాన్స్ ఉందంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పేర్ని నాని చేసిందేమీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు పేర్ని నాని, కొడాలి నాని ఇసుక లారీలు యధేచ్ఛగా తిరిగాయని, వారిద్దరూ ఇసుక దోపిడీ చేశారని స్థానికంగా చెబుతున్నారు. మచిలీపట్నం చుట్టుకప్కల తోడేసిన ఇసుకను హైదరాబాద్ వరకు తరలించుకుపోయేవారనే విమర్శలు ఉన్నాయి. పేర్ని నాని మంత్రి అయిన తర్వాత సొంత ఆస్తులు బాగా కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దానికి తోడు జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థికంగా దిగజారిపోవడం, అభివృద్ధి జాడే లేకపోవడం, ఓటర్లకు కావాల్సిన కనీస అవసరాలు కూడా కల్పించలేక చతికిలపడిపోయిన వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోతుండడం కూడా పేర్ని నానికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలు కూడా మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అంతగా పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి.

మొత్తం మీద ఎన్నో వ్యతిరేకతలను నెత్తిన మూటకట్టుకున్న పేర్ని నానికి ఈ సారి మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి ఆ పదవి కోసం నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రధాన ఎన్నికల అధికారిగా కె.లక్ష్మణ్‌ వ్యవహరించారు.
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.