లొంగుబాటుకు, అరెస్టుకూ తేడా ఏంటి? దేవ్ జీ ప్రకటన ఆంతర్యం ఏంటి?

Publish Date:Mar 14, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సరెండర్ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమా? ఆయన లొంగిపోలేదనీ, షెల్టర్ లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఈ సమాధానం కూడా మావోయిస్టు సానుభూతి పరుల నుంచో, ఇంకా లొంగిపోకుండా ఉద్యమ బాటలోనే ఉన్న మావోయిస్టుల నుంచో కాదు.. స్వయంగా దేవ్ జీ నుంచే రావడంతో.. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల లొంగుబాట్లపై జరుగుతున్న ప్రచారంపైనే అనుమాన నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దేవ్ జీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఆయుధాలను విసర్జించి లొంగిపోలేదనీ, పోలీసులే తనను అరెస్టు చేశారనీ వెల్లడించారు. షెల్టర్ లో తలదాచుకున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడంతో ఇక విధిలేక, అనివార్య పరిస్థితుల్లో అజ్ణాత జీవితానికి స్వస్తి చెప్పి బహిరంగంగా రావాల్సి వచ్చిందని చెప్పారు.  దేవ్ జీ ప్రకటన ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది.  దేవ్ జీ మావోయిస్టు సిద్ధాంతానికి ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టారు. ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపే ప్రశ్నే లేదని తేల్చి చెప్పడమే కాకుండా.. పోరాట పంథా అనివార్యంగా మార్చుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు.  

దేవ్ జీ అరెస్ట్  ఎలా జరిగింది?  అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది?  లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?   ఈ ప్రశ్నలకు సమాధానం మావోయిస్టు ఉద్యమంలో వచ్చిన మార్పులు, పోలీసుల వ్యూహాలు, మావోయిస్టు అగ్రనేతల్లో ఉద్యమం కొనసాగించడంపై ఏర్పడిన అభిప్రాయభేదాలు, ఆ భిన్నాభిప్రాయాలతో  పార్టీ చీలక అంచుకు చేరడం కారణాలుగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మొత్తంగా దేవ్ జీ ఇంటర్వూలో మావోయిస్టుల పోరాట పంధా, ఉద్యమ కొనసాగింపులో ఎదురైన ఆటుపోట్లు, ద్రోహాలూ, త్యాగాలూ మారిన పోలీసు వ్యూహాలకు అనుగుణంగా పార్టీ ప్రతివ్యూహరచనలో వైఫల్యాలు అన్నీ ప్రస్తావించారు. సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం అన్న సిద్ధాంతానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్న దేవ్ జీ అనివార్య పరిస్థితుల్లోనే అజ్ణాత జీవితానికి స్వస్తి పలికినట్లు చెప్పడం సహజంగానే ఆయన లొంగుబాటు లేదా అరెస్టు పోరాట వ్యూహంలో భాగమేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి ఆయన అభిప్రాయాల ప్రకటన రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అధికారపార్టీ బూటకపు లొంగుబాట్లకు తెరలేపిందంటూ ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చింది. 

ఇక లొంగిపోయిన మావోల పునరావాసం, ప్రభుత్వ విధానం వంటి అంశాలపై విస్తృత చర్చకూ, విమర్శలూ, ప్రతి విమర్శలకూ దోహదం చేస్తుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.  
మొత్తం మీద దేవ్ జీ ప్రకటన తెలంగాణ ప్రాంతంలో నక్సలిజంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  తెలంగాణ ప్రాంతంలో  నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు,  మావోయిస్టు  భావజాలం తదితర అంశాలు మరో సారి విస్తృత చర్చనీయాంశాలుగా మారాయి. అపరేషన్ కగార్ నుంచి మావోయిస్టులు అంతమైపోకుండా కాపాడుకునే వ్యూహంలో భాగంగానే లొంగుబాట్లు జరుగుతున్నాయా అన్న అనుమానాలను తెరమీదకు తెచ్చాయి.

 జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకుని పరిస్థితులు కుదుటపడగానే మళ్లీ ఉద్యమ బాట పడతారా.. ఈ సంధి కాలంలో తమ సిద్ధాంతాన్ని ప్రజలలో బలంగా నాటుకునేలా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటారా? అన్న చర్చ మొదలైంది. లొంగిపోలేదు, అరెస్టయ్యాను అంటూ దేవ్ జీ చెప్పడం వెనుక అర్ధం అదేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఏది ఏమైనా లొంగుబాట్ల తదననంతర పరిణామాలు సమాజంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది రానున్న రోజులలో తెలుస్తుందని అంటున్నారు.

By
en-us Political News

  
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.