మనిషి ఎలా జీవించాలంటే...

Publish Date:Jul 30, 2024

Advertisement

మనిషి జీవించే విధానం ఎలా ఉండాలో మనిషే నిర్ణయించుకోవాలి. పూలు ఎక్కడున్నా సువాసన వ్యాపించినట్లు  మనం ఎక్కడ ఉన్నా మన వ్యక్తిత్వం పరిమళిస్తూ ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన పనులు అన్నీ సువాసన సంభరితంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, రోడ్డుపై నడుస్తున్నా, తరగతి గదిలో కూచొన్నా, మన కింద పని చేస్తున్న వారికి ఆజ్ఞలు ఇస్తున్నా.. మనపై అధికారుల ఆజ్ఞల్ని వింటున్నా... అసలు మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా - బతికి ఉన్నంత కాలం... తోటివారు మన గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన విశాల హృదయం గురించి 'భేష్' అనుకోవాలి. అలా ప్రవర్తించాలి.

గర్వం లేకుండా, ఇతరులను హీనంగా చూడకుండా నలుగురికీ తలలో నాలుకలా... నలుగురితో కలగలిసి పోతూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ... మన కర్తవ్యం నిర్వహణ చేస్తూ... ముందుకు సాగడమే మానవ జీవిత సార్థకత అంటే! కమ్మని మామిడి చిగుళ్ళు తినే కోకిలకు ఏ మిడిసిపాటూ ఉండదు. కానీ బురదనీళ్ళు తాగే కప్ప మాత్రం బెకబెకమంటూ ఒకటే గొడవ చేస్తుంది.

"కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః పికః పికః" 

అంటే…

'కాకి నల్లగా ఉంటుంది. మరి కోకిల? అది కూడా నల్లగానే ఉంటుంది. మరి ఏమిటి రెండింటికి తేడా? వసంతకాలం రానీయండి అవి రెండూ గొంతు విప్పితే - కాకి కాకేనని, కోకిల కోకిలేనని తేలిపోతుంది!

అదే విధంగా  మనమంతా... మనుష్యులమంతా... పైకి ఒక్కలాగే ఉంటాం. కానీ కాలం గడిచేకొద్దీ... పుట్టి పెరిగే కొద్దీ... పెరిగి ఎదిగే కొద్దీ మరణం సమీపించే కొద్దీ... మనం సుమధుర సంగీతాన్ని అందించామా, బెకబెకమంటూ అరుస్తున్నామా... అన్నది మనమే తేల్చుకోవాలి.

ఒకసారి ఒక కొంగా, హంసా మాట్లాడుకుంటున్నాయి. హంసను చూసి కొంగ ఇలా అడిగింది:

"కళ్ళు, కాళ్ళు, ముక్కు ఎర్రగా ఉన్నాయ్ ఎవరోయ్

నువ్వు?”

"నేను హంసను”.

“ఎక్కడి నుండి వస్తున్నావు" "మానససరోవరం నుంచి”

“అక్కడ ఏమేం ఉంటాయేమిటి?”

"స్వర్ణ కమలాలు, అమృతం, రత్నాలు, పారిజాతాలు... ఇంకా ఎన్నో మనోహరమైనవి, లోకానికి ఉపకరించేవి.

ఉంటాయి"

"ఇంతేనా! నత్తగుల్లలు ఉండవా?".

"ఉండవు" అందట హంస

అది విన్న కొంగ వేళాకోళంగా నవ్వుకొంటూ వెళ్ళి పోయిందట.

ఇప్పుడు మనకు మనమే నిర్ధారించుకోవాలి - హంసలా బతకాలనుకొంటున్నామా? కొంగలా ఇతరుల్ని వేళాకోళమాడి.. నత్తగుల్లలే గొప్పవని భ్రమపడాలనుకొంటున్నామా!

                                         *నిశ్శబ్ద. 

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.