తెలంగాణ కేబినెట్ భేటీ అజెండా ఏమిటి?
Publish Date:Aug 10, 2022
Advertisement
మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని తేలిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేటీఆర్ అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 11 (గురువారం)న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. తెరాస సర్కార్ ఎదుట నిధుల సమీకరణ సవాల్ ఉంది. మునుగోడు ఉప ఎన్నికతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అధిగమించడం ఎలా అన్న విషయంలో కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్బంధనం చేసేసిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలకే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయంపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికకారణంగా ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో కూడా కేబినెట్ చర్చిస్తుందని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం వ్యయప్రయాసలు పడటం కంటే ముందస్తే బెటరని పలువురు ఇస్తున్న, చేస్తున్నసూచనల నేపథ్యంలో ఆ అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక సెప్టెంబర్ లోనే జరగవచ్చిన జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఏంచేయాలన్న విషయంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం:దని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-the-ajend-of-tomorrows-cabinet-meet-39-141625.html





