వారం రోజులుగా హస్తినలోనే లోకేష్.. వ్యూహం ఏమిటి?

Publish Date:Sep 21, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వారం రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై  జాతీయ మీడియాజాతీయ దృష్టి కేంద్రీకరించేలా చేశారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు సమర్ధంగా బదులిచ్చి జాతీయ స్థాయిలో సమర్థ నేతగా నిరూపించుకున్నారు. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు సై అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు.

అలాగే జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలతో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అందరి మద్దతూ పొందగలిగారు. అయితే ఇక్కడ ఏపీలో ఆయన లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్టుకు ఖండిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు దీక్షలతో, ర్యాలీలతో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యత, పాపులారిటీ ఉన్న నారా లోకేష్ ఈ సమయంలో రాష్ట్రం బయట ఉండటం ఒకింత లోటుగానే కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  మరి లోకేష్ ఢిల్లీలోనే వారం రోజులుగా ఎందుకు మకాం వేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం ఒక్క సారిగా నిస్తేజంగా మారిపోయిందా? ఈ పరిస్థితిని అధిగమించడానికి న్యాయపోరాటం, ప్రజా పోరాటాలు కాకుండా మరో మార్గం ఏమైనా ఉందా? గతంలో  1984 లో అప్పటి ఎన్టీఆర్ సర్కార్ ను అప్పుడు కేంద్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్య విరుద్ధంగా అప్పటి ఏపీ గవర్నర్ రామ్ లాల్ సహకారంతో గద్దె దింపినప్పుడు.. ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహాన్ని ఒక పద్ధతిలో సమన్వయ పరిచి గొప్ప రాజకీయ ఉద్యమంగా మలచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రజాగ్రహాన్ని ప్రజాందోళనగా, రాజకీయ ఉద్యమంగా  మలచే విషయంలో ఎందుకు వెనకబడుతోంది?  

అప్పట్లో ప్రజాందోళనలు కేంద్రం మెడలు వంచేలా పకడ్బందీగా సాగడం వెనుక చంద్రబాబు చాణక్యం ఉంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది.  హస్తినలో  లోకేష్ అదే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ మీడియా ద్వారా జగన్ సర్కార్ అరాచక విధానాలను, ప్రజావ్యతిరేక విధానాలను దేశం కళ్లకు కడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. లోకేష్ ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ కోరలేదు. అసలు వారిని కలుసుకోవాలన్న ఉద్దేశమే లేనట్లుగా హస్తినలో ఆయన వ్యవహరిస్తున్నారు. హస్తిన నుంచే వర్చువల్ గా ఇక్కడి పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సంఘీభావం ప్రకటించేందుకు లోకేష్ ను కలవడానికి జాతీయ స్థాయి నేతలకు క్యూకడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాపకింద నీరులా చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రబావం కేంద్రంలోని మోడీ సర్కార్ కూ  చుట్టుకుంటోంది.  

చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు మోడీ, షాల మద్దతు ఉందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో నెలకొనేందుకు లోకేష్ హస్తిన పర్యటన దోహదపడిందనడంలో సందేహం లేదు. మోడీకి అనుకూలం అని భావించే నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ కూడా బేషరతుగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించడాన్ని ఇక్కయ ప్రత్యేకంగా చెప్పు కోవాలి.  లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేసిన తీరు ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. హస్తినలో లోకేష్ అడుగులు ఒకే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ నూ, మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ నూ కంగారు పెడుతోంది.  

లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచే విధంగా ప్రణాళికా రచన చేసిందని తెలుగుదేశం భావిస్తున్నది. అందుకే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బలంగా న్యాయపోరాటం చేయాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన లోకేష్.. రాష్ట్రంలో తెలుగుదేశం లీగల్ టీమ్ చేస్తున్న పోరాటానికి సమాంతరంగా అవసరమైతే సుప్రీం కోర్టులోనూ చంద్రబాబు అక్రమ అరెస్టును చాలెంజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన తన హస్తిన పర్యటనలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులను కూడా కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. సపోజ్ ఫర్ సపోజ్  హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విషయంలో  వ్యతిరేక తీర్పు వస్తే వెంటనే సుప్రీంను ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నారని చెబుతున్నారు.  

హైకోర్టులో   క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే.. ఏసీబీ కోర్టు  చంద్రబాబును కస్టడీ కి అనుమతించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. అందుకోసమే వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవసరంమై చర్యలు తీసుకుంటున్ానరనీ, అందుకోసమే లోకేష్ వారం రోజులుగా హస్తినలో మకాం వేసి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారనీ చెబుతున్నారు.  మొత్తం మీద లోకేష్ హస్తిన పర్యటన వైసీపీలో గుబులు రేపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో దాదాపు బీజేపీ వ్యతిరేక, అనుకూల పార్టీలన్నీ లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటిస్తుండటంతో బీజేపీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.