ఉండవల్లితో కేసీఆర్ భేటీ ఆంతర్యమిదేనా?

Publish Date:Jun 13, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అంతుపట్టవు. ఉండి ఉండి ఒక్కసారిగా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో ముందుకు వస్తుంటారాయన. ఆ వ్యూహాలలో నైతికత ఉందా, పద్ధతి ప్రకారం రాజకీయాలను నడిపే తీరదేనా లాంటి ప్రశ్నలను ఆయన పట్టించుకోరు. ప్రత్యర్థి పార్టీలనైనా, రాజకీయ ప్రత్యర్థులనైనా బినీత్ ది బెల్ట్ కొట్టడమంటే ఆయనకు మహా సరదా. ఇప్పుడు రాష్ట్రంలో యాంటి ఇంకంబెన్సీ తీవ్రంగా ఉందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన జాతీయ పార్టీ అంటూ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అయితే అది ఒక్కటే చాలదని ఆయనే అనుకున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, తెలంగాణ సెంటిమెంట్ పై ప్రజలను ఇక కదిలించలేమన్న నిర్ధారణక రావడం ఒక కారణమైతే.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలోపేతం కావడం మరో కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

అందుకే ఆయన అనూహ్యంగా ఏపీలో రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు ఉన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లిని తెరమీదకు తెచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఇరువురి మధ్యా ఏ అంశంపై చర్చలు జరిగాయన్న స్పష్టత లేక పోయినా విశ్లేషకులు మాత్రం తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ను రంగంలోనికి దింపేందుకేనని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మాత్రమే ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసి అధికార పగ్గాలు అందుకోవడం సాధ్యమౌతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే అనివార్యంగా రాష్ట్రంలో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు సవాల్ విసరడానికి శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఓట్లుగా మార్చుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్నాయి. త్రిముఖ పోరులో సునాయాసంగా గెలవచ్చు అని ఇంత కాలం భావిస్తూవచ్చిన కేసీఆర్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికలు గట్టి ఝలక్ ఇచ్చాయి.

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరిగా ఉంటుందని భావించడం సరికాదన్నదే ఆ నివేదికల సారాంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నదని క్షేత్ర స్థాయి నుంచి అందిన నివేదికలు  తేటతెల్లం చేయడందతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మరలే అవకాశం ఉందన్న నివేదికలతో ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టిన ఫలితమే తెరపైకి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఇప్పటి వరకూ తెలంగాణలో నామమాత్రంగా ఉన్న జనసేన పార్టీని ప్రోత్సహించి ఎన్నికల బరిలో ఎక్కువ స్థానాలలో పోటీ చేసేలా ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో భారీ చీలిక తీసుకురావాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. పీకే సలహా మేరకే ఉండవల్లిని పిలిపించుకుని మరీ కేసీఆర్ భేటీ అవ్వడం వెనుక కారణం ఇదే నంటున్నారు. జనసేన తెలంగాణలో యాక్టివ్ అయితే.. ఆ పార్టీకి రాష్ట్రంలో భారీగా ఉన్న అభిమానుల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లకుండా ఉంటాయన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.

మొత్తంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ కు నివేదికలు అందిన నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే జనసేన పార్టీని రాష్ట్రంలో యాక్టివ్ చేయడమొక్కటే మార్గమన్న ఎత్తుగడతోనే కేసీఆర్ ఉండవల్లితో ‘ప్రత్యేక’ భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉండవల్లి ఇటీవలి కాలంలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా, జనసేన కు అనుకూలంగా మాట్లాడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లకుండా చీలిక తీసుకు రావడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారనీ అందుకే  ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా జనసేనను రీచ్ కావడానికి యత్నిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.