రాజ్య సభకు కృష్ణయ్య జగన్ రెడ్డి వ్యూహం ఏమిటో ?

Publish Date:May 18, 2022

Advertisement

పొరుగు రాష్ట్రానికి చెందిన.  అది కుడా తమ పార్టీకి రాజకీయ ఉనికి, స్టేక్ లేని తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్యకు వైసీపీ రాజ్య సభ టికెట్ ఆఫర్ చేశారు. (షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయంలో వైసీపీకి తెలంగాణలో పార్టీ  విస్తరించే ఆలోచన లేదని సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది). ఇదొక అనూహ్య పరిణామం అనిపించినా, కాదు. వ్యూహాత్మకంగానే జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని, కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనక జగన్ రెడ్డి  వ్యూహం ఏమిటి? ఏమై ఉంటుంది? అంటే, అందుకు ప్రధానంగా, వినిపిస్తున్న విశ్లేషణ ఓటమి భయం. అవును, జగన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. 

‘మూడేళ్ళ క్రితం ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గడచిన మూడు సంవత్సరాలలో పేదల ఆదాయ మార్గాలకు గండి కొట్టి, తాయిలాలు ఎరగా వేసి, మళ్ళీ ఎన్నికల్లోనూ విజయం సాధించవచ్చనే ఎత్తుగడతో సాగించిన పాలన పూర్తిగా బెడిసి కొట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే బూమ్రాంగ్ అయింది. జగన్ రెడ్డి సంక్షేమం పేరుతొ తమను మోసం చేస్తున్నారనే నిజాన్నిసామాన్య జనం ఎప్పుడోనే గ్రహించారు.   మరో వానక ఇప్పుడు గడపగడపకు కార్యక్రమంలో వ్యక్తమవుతున్న నిరసనలు. మంత్రులు, ఎమ్మెల్యేలు అని చూడకుండా ప్రజలు వైసీపీ నాయకులను ప్రతి గడపన నిలదీస్తున్న తీరుతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడింది. ఓటమి తథ్యం అనే సత్యం తెలిసొచ్చింది. అందుకే  బీసీల ఓటల్కు గాలం వేసేందుకు, పొరుగు రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకుని మరీ ఆర్. కృష్ణయ్యకు, అలాగే మరో బీసీ నేత  బీరం మస్తాన్ రావుకు, రాజ్యసభ టికెట్ ఇచ్చి బరిలో దింపారు. 

అంతవరకు బానే వుంది. అయితే, ఈ వ్యూహం ఫలిస్తుందా, అంటే, అందరినీ అన్ని వేళల మోసం చేయడం, జగన్ రెడ్డికి అయినా, చివరకు ‘మహా’ నేతకు అయినా అయ్యే పని కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అది నుంచి తెలుగు దేశం పార్టీకి, అండగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు, 2019 ఎన్నికల్లో, జగన్ రెడ్డి, ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని నమ్మి మోస పోయారు. కొంచెం చాలా అలస్యంగానే అయినా, చేసిన తప్పు తెలుసు కున్నారు.

 అదే తప్పు మళ్ళీ చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. బీసీల మాతృ సంస్థ టీడీపీ  వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముదస్తు ఎన్నికలకు వెళ్ళినా, గడువు ప్రకారమే ఎన్నికలు వెళ్ళినా, వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని బీసీలే కాదు, అన్నివర్గాల ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. చివరకు సాధారణ మహిళలు కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఓడించి తీరుతామని బహిరంగగా సవాలు విసురుతున్నారు. అంటే, పరిస్థితి ఎంత భయంకరంగా వుందో వేరే చెప్పనక్కరలేదు. 
అదలా ఉంటే, ఆర్. కృష్ణయ్య పేరుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడే అయినా, అదొక స్వయం ప్రకటిత పాడవే కానీ, ఆయన్ని బీసీలు అందరూ తమ నేతగా గుర్తించి ఇచ్చిన పదవి కాదు. ఆయన్ని ఎవరూ ఎన్నుకోలేదు. ఆయనకు ఆయనే నేను అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు. నిజానికి, ఆయన బీసీలు అందరూ ఆయన వెంట నడిచేంత గొప్పనాయకుడు కాదు. అంతే కాదు, అయన రాజకీయంగా ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా,  ఒక్కసారి మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది కుడా తెలుగు దేశం పుణ్యానే ఆయన 2014లో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఒక్కసారి కూడా  ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే కృష్ణయ్య 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా, మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలిపారు.

సో.. సొంత రాష్ట్రంలోనే స్వయంగా ఓడిపోయిన ఆయన పొరుగు  రాష్ట్రంలో, పొడిచేది ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు, జగన్ రెడ్డికి, ఎవరు ( పీకే కాదు కదా) ఈ అద్భుత సలహ ఇచ్చారో ఏమో కానీ, ఇది కూడా బూమ్రాంగ్ అవుతుందని అంటున్నారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ స్వరాష్ట్రంలో, సొంతంగా గెలవలేని , స్వయం ప్రకటిత బీసీ నేత కృష్ణయ్య వలన వైసీపీకి రాజకీయ ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు.  

బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన కృష్ణయ్య వలన  వైసీపీ మూడేళ్ళ ముదనష్ట పాలనలో సొంతం చేసుకున్న యాంటీ బీసీ ఇమేజ్ మారిపోదని అంటున్నారు. అంతే కాకుండా, కృష్ణయ్య ట్రాక్ రికార్డులో మరకలు మచ్చలు చాలానే ఉన్నాయని అంటారు. అలాగే, నిజానిజాలు ఎలాఉన్నా ఆయన బీసీ ఉద్యమాన్ని ఒక వ్యాపారంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. కృష్ణయ్య 1994లో సిన్సియర్’గానే బీసీ సంక్షేమ సంఘం స్థాపించినా, అనంతర కాలంలో ఆయన దాన్నొక వ్యాపార సంస్థగా మార్చడంతో పాటుగా బ్లాక్’ మెయిల్ రాజకీయాలు చెశారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి, కరుడు కట్టిన నేరస్తుడు, నయీంతో తనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, నయీం తన శిష్యుడని కృష్ణయ్య స్వయంగా ప్రకటించుకున్నారు. సో..  జగన్ రెడ్డి, ఏపీలో అర్హులైన బీసీలే లేనట్లు, ఏమి ఆశించి  పొరుగు రాష్ట్రం  నుంచి కృష్ణయ్య ఎరువు తెచ్చుకున్నారో గానీ, ఆయన ఆశించిన ప్రయోజనం మాత్రం అంది ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు. నిజమే, వైసీపీకి మంద బలం ఉంది కాబట్టి, కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడు అవుతారు.
అందులో సందేహం లేదు. కానీ, బీసీలను మెట్టులుగా చేసుకుని  మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్న జగన్ రెడ్డి కలలు కలుగానే మిగిలిపోతాయని అంటున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం అయ్యే పనికాదని, పైగా, జగన్ రెడ్డి నిర్ణయానికి సొంత పార్టీ నుంచి కూడా ఎదురుదెబ్బ తప్పదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.