Publish Date:Mar 15, 2026
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది. ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ తమ ఓటమికి ఈసీనే కారణమని వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం.
సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-jagan-stand-39-215524.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.