దేశంలో ఏదో జరుగుతోంది ఏమిటది ?

Publish Date:Sep 22, 2022

Advertisement

దేశంలో ఏదో జరుగుతోంది. ఏమి జరుగుతోంది అనే  విషయంలో ఎవరికీ అంత స్పష్టత లేక పోయినా, ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓ వంక రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లిం సమాజంతో సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టింది. సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఇతర సంఘ్ పెద్దలతో కలిసి, ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి తో సమావేసమయ్యారు. ఢిల్లీ లోని కస్తూరిబా గాంధీ మార్గ్ చర్చిలో    బుధవారం(సెప్టెంబర్21) సుమారు గంటకు పైగా ఈ రహస్య సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో  మోహన్ భగవత్ తో పాటు సంఘ్ ప్రముఖులు కృష గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్ కుడా పాల్గొన్నారు. 

అయితే, ఈ సమావేశానికి  ప్రత్యేక ప్రధాన్యత ఏదీ లేదని, ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ చెప్పారు. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ముస్లిం మేథావులతో చర్చలు జరుపుతున్నారని, అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందని అంతకు మించి ఈ భేటికీ ప్రత్యేక ప్రధాన్యత లేదని అయన చెప్పారు. సంఘ్ అధినేత అన్ని వర్గాల ప్రజలతో నిరంతరం నిర్వహించే, ‘సంవాద్’ కార్యక్రమంలో భాగంగానే మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి కలిశారని చెప్పారు.  

కానీ అదే సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్నాయి. మరోవంక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోం శాఖ సీనియర్ అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. అలాగే, హోంమంత్రి నిర్వహించిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధొభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తా సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు. దీంతో  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏదో తీసుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. 

నిజానికి  పీఎఫ్‌ఐ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో  మత ఉద్రిక్తలకు దారి తీసిన సంఘటనల వెనక, పీఎఫ్‌ఐ హస్తం ఉందని ఎన్‌ఐఏ నిర్ధారణకు వచ్చింది. అలాగే మొదటి నుంచి కూడా యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్ట విరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 కాగా నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఆర్ఎస్ఎస్ అధినేత్ మోహన్ భగవత్ ముస్లిం పెద్దలు, మేథావులతో సమావేసమై ఉంటారని అంటున్నారు. అలాగే ఇటీవల మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను, అదే విధంగా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపే అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జరుగతున్న పరిణామాలు, గతంలో జరిగిన పరిణామాలు ఒకదానికొకటి  సంబంధం లేనట్లు కనిపించినా ఎక్కడో ఏదో సంబంధం ఉన్నట్లే ఉందని, అందుకే దేశంలో ఏదో జరుగుతోందని అనుమానించ వలసి వస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.