అమ్మ‌వ‌వుతావ‌ని ఆశ‌లు పెట్టారు...వెలుగులోకి డాక్ట‌ర్ల మోసం

Publish Date:Sep 22, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సిని మా గుర్తండే ఉంటుంది. అందు లో చ‌నిపోయిన వ్య‌క్తికి ఆప‌రేష‌న్ చేయాలంటూ ల‌క్ష‌లు గుంజు తారు ఓ ఆస్ప‌త్రివారు. అస‌లు సంగ‌తి తెలుసుకుని చిరు వారి నుంచే డ‌బ్బులు ఇప్పిస్తాడు. దాదాపు ఇదే సీన్ కాకినాడ‌లో జ‌రిగింది. తూర్పు గోదావరిజిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారా యణతో వివా హం అయ్యింది. ఈ ఏడాది జనవరిలో సత్యనారా యణ తన భార్యను వైద్య పరీ క్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసు కెళ్లారు. గర్భందాల్చిందని చెప్పి వైద్యులు తొమ్మిది నెలలు తిప్పించుకుని.. ట్రీట్‌మెంట్‌ చేశారు. పరీక్షల కోసం తరచూ అదే ఆస్పత్రికి వెళుతున్నారు. డాక్టర్లు వెళ్లిన సమయంలో స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. అంతటితో ఆగకుండా ఆరో నెలలో స్కా నింగ్‌ తీసి.. సెప్టెంబర్‌ 22న ప్రసవం అవుతుందని డాక్టర్లు చెప్పారు. 

ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లగా..కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడి డాక్టర్లు స్కానింగ్‌ తీసి అసలు మహాలక్ష్మి గర్భవతి కాదని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మితో పాటు కుటుంబ సభ్యు ల‌కు నోట మాట‌రాలేదు.. ఆశ్చ‌ర్యంతో, మోసపోయామ‌న్న ఆందోళ‌న‌తో ఉండిపోయారు.

ఆందోళనకు గురైన మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ రమ్య ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్‌ తీయాలని కోరారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్‌ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని  చెప్పడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇదేంటని డాక్టర్‌ను ప్రశ్నించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆస్పత్రికి తిప్పి వేల రూపాయలు ఖర్చు పెట్టించారని మహాలక్ష్మి తల్లి ఆరోపించారు. గర్భంలో బిడ్డ ఆరో గ్యంగా ఉందని చెప్పి ప్రతి నెలా మందులు రాసిచ్చారని.. వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని వాపోయారు. కాసుల కోసం అమ్మతనంతో ఆటలు ఆడిన  రమ్య ఆస్పత్రి డాక్టర్ల పై  చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు.

కాకినాడ రమ్య ఆసుపత్రి వివాదం మరింత ముదిరింది. లేని గర్భాన్ని ఉన్నట్లు నమ్మించి దొంగ‌ రిపోర్టులు ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆమెకు గర్భం రాలేదని తాము కూడా చెప్పామంటున్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. ప్రతీ గ‌ర్భ‌వ‌తికి మూడో నెల, ఆరో నెల, తొమ్మిదో నెలలో స్కానింగ్‌ తీయిస్తామన్నారు. స్కానింగ్‌ చేయిం చుకోవాలని తాము ఎన్నిసార్లు చెప్పినా.. వాళ్లు చేయించుకోలేదని తెలిపారు. ఆగస్టు 25న 8వ నెలలో స్కానింగ్‌ చేయించి నప్పుడు బిడ్డ లేదని స్పష్టం చేశామన్నారు. కానీ, ఆ రిపోర్టును వారు చూపడం లేదని అంటున్నారు.

మహాలక్ష్మినే..ఫాల్స్‌ ప్రెగ్నెన్సీ ఊహించుకుందని.. ప్రతీసారి బేబీ కదులుతోందని చెప్పిందన్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. అసలు, తాము డెలివరీ డేటే ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎవ‌రిని న‌మ్మాలి. ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్ల మోసాల‌కు అంతులేకుండా పోతోంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.