Publish Date:May 28, 2022
చెప్పేదొకటి.. చేసేదొకటి ఏపీలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంటోంది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీలోకి దిగుతామంటూ బీజేపీ చేసిన ప్రకటన వెనుక వ్యూహమేమిటన్నది రాజకీయ పండితులకు సైతం అంతుబట్టడం లేదు. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. రాజకీయ పార్టీలు పోటీకి దిగకుండా ఉండటమన్నది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది.
అయితే బీజేపీ మాత్రం పోటీకి దిగుతామంటూ చేసిన ప్రకటన ఏ ఉద్దేశంతో అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది. గతంలో బద్వేలు నియోజవకర్గ ఉప ఎన్నికలో కూడా బీజేపీ పోటీ చేసి దారుణంగా పరాజయం పాలైన సంగతి ఈ సందర్భంగా ఒక సారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణింతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. మరణించిన ఎమ్మెల్యేకు సానుభూతిగా అక్కడ ఆయన భార్యను వైసీపీ రంగంలోకి దింపడంతో ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తెలుగుదేశం భావించింది.
సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని తెలుగుదేశం నిర్ణయం తీసుకొంది. జనసేన కూడా పోటీ నుంచి తప్పుకుని ఆనవాయితీని, సెంటిమెంటునూ గౌరవించింది. అయితే ఏ మాత్రం గెలుపు అవకాశం లేని బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం ఉప ఎన్నికలో పోటీకి దిగాయి. ఫలితం అనూహ్యమేమీ కాదు. బద్వేలులో బీజేపీ, కాంగ్రెస్ లు డిపాజిట్లు కోల్పోయాయి. వాటికి డిపాజిట్లు వచ్చినా ఒరిగేదేం లేదు కానీ, ఆ రెండు పార్టీలూ పోటీలో ఉండటం వైసీపీకి ప్రయోజనం చేకూర్చిందనే చెప్పాలి.
ఇప్పుడు ఆత్మకూరులోనూ బీజేపీ పోటీకి దిగుతానంటూ ముందుకు వస్తున్నది. బీజేపీ వైఖరి వైసీపీ నెత్తిన పాలుపోయడం కోసమేనా అన్న ప్రశ్నకు విశ్లేషకులు ఔనని అంటున్నారు. కనీసం పోత్తులో ఉన్న జనసేన పార్టీతో చర్చించకుండా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ప్రకటించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఎన్నిక ఏకగ్రీవం అయితే వైసీపీ విజయం సాధించిందని మాత్రమే చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా మరో పార్టీ పోటీలో నిలబడటంతో గత కంటే ఎక్కువ మెజారిటీ సాధించామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రచారం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి ఏదో మేరకు సానుకూలత చేకూరుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వైసీపీ విధానాలను విమర్శిస్తున్న బీజేపీ చేతలలో మాత్రం ఆ పార్టీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. కనీస ఓట్లు సాధించుకునే బలం కూడా లేని బీజేపీ సెంటిమెంటును, సంప్రదాయాన్నీ కూడా కాదని ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెడతానంటూ ముందుకు రావడం వైసీపీకి మేలు చేయడానికేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బద్వేలు అనుభవం తరువాత కూడా ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీకి సిద్ధపడం అందుకు సంకేతమనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-bjp-stratagy-behind-contesting-in-atmakur-by-poll-39-136591.html
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా రెండు రోజుల పాటు ఇటు బీజేపీ, అటు తెరాస హైదరాబాద్ వేదికగా రాజకీయ సర్కర్ చేశాయి. ప్రజలతో సంబంధం లేని విన్యాసాలెన్నో చేశాయి. ప్లెక్సీల యుద్ధం నుంచీ కేంద్రం సహాయం వరకూ ఇరు పార్టీలూ పరస్పర విమర్శలలో పోటీ పడ్డాయి. కాషాయ దళం మొత్తం రావడం చుస్తే గులాబి కోటని ఆక్రమించుకోవడానికి రాజు తన బలం తో సైన్యం తో వచ్చి తన బలం ఏమిటో చూపించి నట్టు వుంది.ఆదివారం హైదరాబాద్ లో
జరిగిన భారతియ జనతా పార్టీ విజయ సంకల్పసభ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి మాటలమయజాలం తో అందర్నీమాయలో పడేసారు .
కాలక్రమంలో మొబైల్ ఫోన్ వచ్చి అందరికీ ఆత్మీయం అయి కూర్చుంది. చేతిలో మొబైల్ వుంటే లోకమంతా అరచేతిలో వున్నట్టే అంటూ యాడ్స్ తో యువతను విప రీతంగా ఆకట్టుకోవడంలో మొబైల్ కంపెనీలు లాభార్జన బాటలో వున్నాయి. ఇపుడు రోజుకో కొత్త రకం ఐ ఫోన్లు చూస్తున్నాం. ఆటలు, పాటలు, సినిమాలు, సీరియళ్లు ఒకటేమిటి అంతా దానితోనే సాగిపోతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా... ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు. అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు.
అత్తమీద కోపం దుత్త మీద చూపించాడన్నది సామెత. కానీ ఢిల్లీకి చెందిన ధరమ్ వీర్ దహియా కుక్క మీద కోపం ఆ కుక్క యజమానుల మీద చూపించాడు. అలాగని కుక్కనూ వదిలేయలేదు. దానిమీదా దాడి చేసి తన కోపం తీర్చుకున్నాడు. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ సంఘటనకు ఢిల్లీ వేదిక అయ్యింది. ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివసించే ధరమ్ వీర్ దహియా ఉదయాన్నే వాకింగ్ కు వెళుతుంటే.. పొరుగింటి వారి కుక్క అతడిని చూసి మొరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యాన్మాయ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్ గడప దాట లేదు.మరోవంక వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది.
ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు.
బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది. ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
మొత్తానికి బిజెపి యావత్ సైన్యం వచ్చి చేసిన తప్పుడు ప్రచారాలు, ఊకదంపు ప్రసంగాల వల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వచ్చే నష్టం శూన్యం. ప్రతిగా బిజెపీ వర్గాలే నష్టపోయే అవకాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాటయినప్పటి నుంచి కేంద్రం పెద్దగా సహకరించిందేమీ లేదని, ఇపుడు మరింత రాజకీయ వైఫల్యాన్ని బిజెపీ స్వయంగా ఇంత దూరం వచ్చి తెలంగాణాలో బయటపడటం పట్ల అంతా నవ్వుకుం టున్నారు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగే సభలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చోటు లేదని తేలిపోయింది. ఈ సభలో వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. ప్రధాని సభలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి అవకాశం ఉండాలి. అయితే అందుకు భిన్నంగా సభలో ప్రధానితో పాటు వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు.
తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు.
కోర్టులు ఆదేశించినా, ఏకంగా పీఎంవో నుంచే అవరోధాలు సృష్టించవద్దంటూ ఆదేశాలు వచ్చినా జగన్ సర్కార్ నర్సాపురం ఎంపీ రఘురామరాజును వదలడం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకుండా చేయాలని ‘ఔట్ ఆఫ్ ది వే’ ప్రయత్నాలను ఆపడం లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్నారు. ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఎంపి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి.. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కోర్టు ఎంపీని అరెస్టు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన భీమవరం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భీమవరం కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయించింది. దీంతో కోర్టు తీర్పును లెక్క చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు.
వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యంగా వైసీపీ ప్లీనరీకి ముందు జిల్లాలలో జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఆ సమావేశాలలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాల గుట్టు రట్టు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. జోగి రమేష్ ఒక్కరే కాదు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
పంజాబ్ లో తొలి సారిగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ఐదుగురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.