సర్వేల వెనుక చీకటి కోణాలు! ఆరా సర్వే అసలు కథేంటి?

Publish Date:Jul 15, 2022

Advertisement

తెలంగాణలో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తోందా? ఎన్నికల వ్యూహ కర్తల హవా  నడుస్తోందా? రాష్ట్రంలో సర్వే జనులు, ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరుగుతోందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, అదే సమయంలో, ప్రతి సర్వే వెనక ఒక చీకటి కోణం దాగుందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

గత మూడు నాలుగు రోజులగా ఆరా మస్తాన్ సర్వే చుట్టూ సాగుతున్న చర్చ రచ్చ వివాదం వెనక కూడా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల చీకటి కోణం దాగుందని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెసుస్తోంది.   కొద్దిరోజుల క్రితం టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ హైర్ చేసుకున్నఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, ఆరా మస్తాన్ వరకు అందరు చేసిన సర్వేలలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్’లో ఉందని, చెప్పు కొచ్చారు. అయితే, సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ అందరి సర్వే నివేదికలు, తనకు ఎక్కడి  నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మాత్రం చెప్పలేదు.

అయితే,రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమ అభద్రతా భావాన్ని, భయాన్ని  కప్పిపుచ్చుకునేందుకు  సర్వేలను అడ్డుపెట్టుకుని గంభీర ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడప్పుదు ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏదో గాలి కబురుగా కాకుండా, సర్వే సంస్థలు, సర్వే సంస్థల యజమానుల పేర్లు కూడా  తీసుకున్నారు.  ఆ నివేదికలు అన్నీ, తన కళ్ళతో తాను చూసినట్లే చెప్పుకొచ్చారు. ఒక విధంగా,  విత్ అల్ డ్యూ రేస్పెక్ట్స్ టూ కేఏ పాల్ , అయన స్టైల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసిందని, తాను ముఖ్యమంత్రి అయిపోయాననే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. బహుశా, ఆ సంస్థలేవీ తమను పట్టించుకోవని అనుకున్నారో  ఏమో కానీ, సర్వే సంస్థల పేర్లు చెప్పి మరీ జబ్బలు చరుచు కున్నారు.  అయితే, కాంగ్రెస్ ‘బలుపు’కు రేవంత్ ఆధారంగా చూపిన ఆరా మస్తాన్’ రేవంత్ రెడ్డి తమ  సంస్థ పేరు తీసుకునందున, వివరణ ఇచ్చేదుకు స్వయంగా  తెరమీదకు వచ్చారు.

ఆయన, తమ సంస్థ జరిపిన సర్వేకి సంబంధించి రేవంత్ చెప్పింది తప్పని చెప్పారు. ఆయన వెర్షన్ అయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో కాదు థర్డ్ పొజిషన్  లో ఉందని తమ సర్వే నివేదికను బయట పెట్టారు. అక్కడితో అగ్గి రాసుకుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చేయని చౌకీదార్ చోర్  వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం చేసి, చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు, ఆరా మస్తాన్ కోర్టుకు వెళితే రేవంత్  రెడ్డి కూడా క్షమాపణలు చెప్పవలసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు.   అప్పుడు గానీ, రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేశారో ఆయనకు, కాంగ్రెస్ పార్టీలో ని ఆయన వర్గానికి తెలిసినట్లు లేదు. అయితే, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభించింది.

రేవంత్ రెడ్డి తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశారని లోపాయికారిగా దెప్పిపొడవడం  ప్రారంభించారు. అసత్యాలు, అర్థ సత్యాలు  చెప్పి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని కాంగ్రెస్  సీనియర్లు  ఢిల్లీకి  వర్తమానం చేర వేశారు. అదే సమయంలో, రేవంత్ వర్గం డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, ఆరా మస్తాన్ పుట్టు పూర్వోత్తరాలు, బయటకు తీసి ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. ఆయన భావజలాం లోతులు తవ్వి ఆయన సంఘీయుడు అని తేల్చారు. కావచ్చును, అయనకు బీజేపీతో సంబంధాలు ఉన్న మాట నిజం కావచ్చును. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో సంబంధాలు ఉంటే ఉండ వచ్చును, ఆమాటకొస్తే, రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలను తవ్వి తీసినా ఆయన కూడా  సంఘీయుడే.

ఏబీవీపీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని అంటారు.  అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు, ఎందుకోసమో, ఎందు కోసమో ఏముంది లెండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సొంతగా జరిపించిన సీక్రెట్ సర్వే లో కాంగ్రెస్ పరిస్థ్తితి ఏమంత బాగలేదని తేలిందని, ఢిల్లీకి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ గా కొనసాగితే, పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్ధులు బరిలో దిగే ప్రమాదముందని, ఆయన తమ వర్గం వారికే టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని, అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సీనియర్లు నేరుగా అధిష్టానానికి నివేదికలు సంర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి  సర్వే నివేదికలను అడ్డు పెట్టునికి తనను తానూ రక్షించుకునే ప్రయత్నం చేశారని,  విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎవరి వ్యుహమో, ఎవరితో ఎవరి చీకటి ఒప్పందమో ఏమో కానీ, ఆరా మస్తాన్ తెర మీదకు రావడంతో రేవంత్ కథ అడ్డం తిరిగిందని, అంటున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.