అవినాష్ తల్లి హెల్త్ బులిటెన్లో ఏముంది? ఏం జరుగుతుంది?

Publish Date:May 22, 2023

Advertisement

అవినాష్ రెడ్డి సీబీఐకి చుక్కులు చూపిస్తున్నారు. దేశంలో సర్వోన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అవినాష్ ముందు చిట్టులుకలా మారిపోతోంది. విచారణకు డుమ్మా కొట్టినా, పదే పదే ఏవో సాకులు చెప్పి గైర్హాజరైనా చర్యలు తీసుకునే చొరవ చేయలేకపోతోంది. సీబీఐ తీరు చూస్తుంటే.. ఆసలది దర్యాప్తు సంస్థఏనా? అన్న అనుమానం సామాన్యులకు సైతం కలిగేలా ఉంది. అటువంటి సీబీఐ ఎట్టకేలకు ధైర్యం చేసి కర్నూలు చేరుకుని అక్కడి ఎస్పీకి తాము అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. లొంగిపొమ్మనండి లేదా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

అయినా కర్నూలులో పోలీసుల సహకారం కరవైందా?  లేక సీబీఐకే ధైర్యం తక్కువైందా తెలియదు కానీ ఈ తెల్లవారు జామునుంచీ ఆస్పత్రి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఇహనో ఇప్పుడో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయనున్నారని అంతా భావిస్తున్న వేళ ఇప్పటి వరకూ హెల్త్ బులిటిన్  విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ చెబుతూ వచ్చిన కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు అవినాష్ తల్లి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ బులిటిన్ లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు.  ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు.

ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజులుగా విడుదల కాని హెల్త్ బులిటెన్ ఇప్పుడే విడుదల కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆసుపత్రి అవినాష్ స్నేహితుడికి చెందినది కావడం, పులివెందులకు దగ్గరగా ఉన్న బెంగళూరును కాదని, అలాగే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే హైదరాబాద్ నూ కాదని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ తన తల్లిని చేర్చించడంపై నాలుగు రోజుల కిందటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ లలో కంటే కర్నూలులో మెరుగైన వైద్యం లభిస్తుందని కాకుండా సీబీఐ నుంచి తనకు ర క్షణ ఏపీలో అయితేనే ఎక్కవ అన్న భావన ఆయనలో ఉందని కూడా పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని అంతా భావిస్తున్న వేళ.. అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల కావడం అనుమానాలకు తావిస్తున్నది.  

నిజంగానే అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించి తీరాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే ఇప్పుడు విషయం అది కాదు.. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపైనే అనుమానాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆ సంస్థ నోటీసులను ధిక్కరించిన తీరు కారణంగానే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పూర్తిగా  ఆయన స్వయం కృతం. విశ్వభారతి ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అవినాష్ ను అరెస్టు నుంచి కాపాడటానికా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా అవినాష్ సీబీఐ విచారణను తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సోమవారం (మే 22) ఉదయం నుంచీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కాకమానవు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే స్వతంత్రంగా పని చేస్తోందా అన్న అనుమానాలూ వ్యక్తం కాక మానవు. కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న విశ్వ భారతి ఆసుపత్రి మొత్తం వైసీపీ, అవినాష్ అనుచరుల  అధీనంలోనే ఉందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీబీఐ వాహనాలు ఆ ఆసుపత్రి ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన అవినాష్ రెడ్డి అనుచరులు ఆ తరువాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించడానికి నానా అగచాట్లూ పడ్డుతున్నారు. వారిని బ్రతిమలాడుకుంటున్నారు. అంతకు మందు ఆదివారం రాత్రి విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో అవినాష్ అనుచరులు సృష్టించిన వీరంగాన్ని పోలీసలు ప్రేక్షకుల్లా తిలకించారు. వైసీపీ ఎమ్మెల్యే తరువాత తీరిగ్గా రంగప్రవేశం చేసి పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ విలేకరులకు చెప్పారు.

అనినాష్ అనుచరుల స్వైర విహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా విలేకరులకు అవకాశం లేకుండా అవినాష్ అనుచరులు వారికి వెంబడించారంటే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు.  నిన్న అర్ధరాత్రి నుంచీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద  పదుల సంఖ్యలో ఉన్న అవినాష్ అనుచరుల వీరంగం సృష్టిస్తే.. మీడియా ప్రతినిథులపై దాడులు చేస్తే.. ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు.  సీబీఐ అధికారులను ఆసుపత్రి వద్ద అడ్డుకుంటుంటే ఆపడానికి పోలీసులకు అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, లేదా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.