కోకాకోలా మాత్రమే తాగితే?

Publish Date:Mar 18, 2021

Advertisement

కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే
ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో
ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు.  ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..!  సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా  శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?  దంతాలను ఏమి చేస్తుంది..?  నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.?

ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ...

డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే  ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి  రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి  రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే.  కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే
పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే.  ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి.

ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు.  టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది.   అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి  చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!

By
en-us Political News

  
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది?
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.