జగన్ ను కేంద్రం దూరంపెట్టిందా? పెట్టినట్టు చేస్తోందా?

Publish Date:Sep 20, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు, ఆర్థిక అవకతవకలకు కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఉన్నాయా అన్న విషయంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టు విషయంలో మోడీ సర్కార్ ఆశీస్సులూ, ప్రోత్సాహం, అండదండలూ జగన్ రెడ్డి సర్కార్ కు ఉన్నాయన్న అభిప్రాయానికి రోజురోజుకూ బలం చేకూరుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, నిబంధనలను తోసి రాజని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇష్టారీతిన అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసే సాహసం చేసిందంటే.. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ముందడుగు వేసిందని నమ్మలేమని పరిశీలకులు సైతం అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అరెస్టు విషయంలో తమకు కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు సంపూర్ణంగా ఉందని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అంతే కాదు..ఈ ఒక్క కేసే కాదు రానున్న రోజులలో మరిన్ని కేసులలో చంద్రబాబును విచారిస్తామనీ, చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నూ తెలుగుదేశం ముఖ్య నాయకులనూ కూడా అరెస్టు చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వ్యూహాత్మకమా? వాస్తవమా అన్నది పక్కన పెడితే జనబాహుల్యంలో మాత్రం జగన్ రెడ్డికి మోడీ, షాల మద్దతు సంపూర్ణంగా ఉందని భావనే వ్యక్తం అవుతోంది.  

అయితే వైసీపీ చెబుతున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు వైసీపీ అడ్డగోలు అరాచక చర్యలకు అండదండలు అందిస్తూనే, ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని చూసీ చూడనట్లు వదిలేసి మరిన్ని అనుమతులకు అప్పులిస్తూనే.. మరో వైపు జగన్ ను బీజేపీ అధినాయకత్వం చక్రబంధంలో బిగించేసిందా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని తాను విదేశీ పర్యటనలో ఉండగా స్కిల్ స్కామ్ పేరిట   అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా   అరెస్టు చేయించిన తీరు పట్ల దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా స్పందించలేదన్న మాటే కానీ బీజేపీకి చెందిన రాష్ట్రాల అధ్యక్షులు, పలువురు కేంద్ర మంత్రలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. జగన్ అరాచకాలను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు భువనేశ్వరి అయితే చంద్రబాబు అరెస్టు తీరు అప్రజాస్వామికమని విమర్శించడమే కాకుండా, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని, అవినీతి పాలనను కడిగిపారేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ఇలా బీజేపీ నాయకులంతా కూడా జగన్ అరాచకాన్ని తూర్పారపడుతూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఇదలా ఉంచితే చంద్రబాను అరెస్టుకు బీజేపీ అధినాయకత్వం  మద్దతు ఉందని చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ నేతలకు ఈ పరస్థితి మింగుడు పడటంలేదు.

అలాగే జగన్ తన విదేశీ పర్యటన నుంచి వచ్చీ రాగానే హస్తిన పర్యటనకు వెళతారనీ, మోడీ, అమిషాలతో భేటీ అవుతారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిగో బయలుదేరుతున్నారు..అదిగో బయలుదేరుతున్నారు అంటూ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ హస్తిన పర్యటనకు వెళ్లిందీ లేదు. అసలు వెడతారో లేదో కూడా తెలియదు. ఆయన యధా ప్రకారం బటన్ నొక్కుడు కార్యక్రమాలలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ ఆయా కార్యక్రమాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వినలేక జనం బయటకు వెళ్లి పోతున్న దృశ్యాలు మీడియాలో అందరూ చూశారు కూడా. అది పక్కన పెడితే.. ఇంతకీ జగన్ హస్తిన పర్యటనకు ఎందుకు వెళ్లలేదు. ఆయనకు మోడీ, షాల అప్పాయింట్ మెంట్ దొరకలేదా? లేదా హస్తిన వెడితే చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్న బెరుకా? లేక ఇప్పటికే హస్తినలో లోకేష్.. బాబు అక్రమ అరెస్టునకు నిరసనగా జాతీయ మీడియా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన నేపథ్యంలో జగన్ హస్తినలో అడుగుపెడితే.. లోకేష్ చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు విసిరిన సవాల్ కు జవాబు చెప్పాల్సి వస్తుందన్న బెరుకా అంటూ సామాజిక మాధ్యమంలో జగన్ కు ఓ రేంజ్ లో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజనులు.

వాస్తవానికి చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు కారణంగా ఏపీలోనే కాదు దేశ విదేశాల్లో కూ డా వైసీపీతో  పాటుగా మోడీ సర్కార్ పై కూడా ఆగ్రహం పెల్లుబుకుతోంది. తమ పరువును జీ20 శిఖరాగ్ర సదస్సు సాక్షిగా గంగలో కలిపేసిన జగన్ పై ఆగ్రహంతో బీజేపీ అధినాయకత్వమే ఆయనను దూరం పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇంతటి అరాచక పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్ కు అడ్డగోలుగా అప్పులు చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఇంకా అనుమతులు ఇస్తుండటంతో అసలు ఏం జరుగుతోంది? అప్పాయింట్ మెంట్ లేదనడం, జగన్ హస్తిన పర్యటన నిరవధికంగా వాయిదా పడటం, బీజేపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఇదంతా ప్రజలను మభ్యపెట్టే వ్యూహంలో భాగమేనా? అన్న అనుమానాలను కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ తన ప్రతిష్టను మంటగలుపుకుని మరీ జగన్ తో బంధం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో జగన్ కు వత్తాసు పలుకుతున్న బీజేపీపై జాతీయ స్థాయిలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతున్నదనడానికి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతే నిదర్శనమంటున్నారు.  

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.