పవన్ కల్యాణ్ కు ఏమైంది?

Publish Date:Apr 16, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా  ఆయన   తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడానికి బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని  సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఒక్క  ఉపముఖ్యమంత్రే కాదు. ఆయన అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కూడా. కీలక శాఖల మంత్రిగా ఆయన తరచూ విస్తృత పర్యటనలు చేయడంతో ఆయన వెన్నునొప్పి తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పవన్  కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్న సమ యంలో సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయ పడ్డాడు. దీంతో ఆయన అడవితల్లి బాట కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ బయ లు దేరి వెళ్లారు. ఆ తరువాత  తన కుమారుడు మార్క్ శంకర్ ను ఎత్తుకుని విమానాశ్రయంలో కనిపించారు. అదే చివరి సారి ఆయన బహిరంగంగా కనిపించడం.

సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించి, కుమారుడి పేరుమీద అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకు కారణం కూడా ఆయన బ్యాక్ పెయినే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా రాకపోవడంతో వెన్ననొప్ప తీవ్రంగా ఉందని భావించాల్సి వస్తున్నది.   

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.