ష్.. గప్ చిప్.. కొడాలికి ఏమైంది?

Publish Date:May 20, 2023

Advertisement

కొడాలి నాని  తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన ఆయన తనకు మాత్రమే ప్రత్యేకమైన బూతుల మంత్రి అని బిరుదు కూడా పొందారు. మంత్రిగా ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు విలువలకు వలువలు ఒలిచేసినట్లుగా ఉండేవి. ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనుచిత విమర్శలు చేసి వార్తల్లో నిలిచేవారు.

ఆయన మాట్లాడే భాష ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేకపోయినా.. దానినే వాడుతూ ఒక విధంగా నెగటివ్ పాపులారిటీ విపరీతంగా పొందారు. అదే సమయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలను సీఎం జగన్ ఏ మాత్రం ఖండించకపోవడం, పైపెచ్చు ముసిముసి నవ్వులతో ప్రోత్సహించడంతో నాని ఇంకా రెచ్చిపోయేవారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా.. బూతుల మంత్రిగా జగన్ తొలి కేబినెట్ లో ఓ వెలుగు వెలిగిన కొడాలి నానికి చిత్రంగా మలి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. పునర్వ్యవస్థీకరణలో నాని మంత్రి పదవి ఊడింది. ఆ సమయంలో ఆయన ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. నోటికి తాళం వేసుకుని  ఓ పశువుల పాకలో పడుకున్న ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి కూడా. సరే కొంత కాలం మౌన మునిలా మారిపోయిన కొడాలి నాని ఆ తరువాత మళ్లీ తన నోటికి పని చెప్పడం ప్రారంభించారు. అది వేరే సంగతి. మధ్యలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నాని మరోసారి నోటికి తాళం వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. 


బీజేపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడికక్కడ చార్జిషీట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గుడివాడలో బీజేపీ చార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ నానిపై, నాని భాషపై, ఆయన కాసినో వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయకూడదని  అన్నారు. అంతే కాకుండా ఇటువంటి నేతలను తమ పార్టీ  అధికారంలోకి వస్తే జైల్లో పెట్టిస్తామన్నారు. సరే.. సునీల్ దియోధర్ విమర్శించినది అలాంటిలాంటి నేతను కాదు.. నోరు విప్పితే బూతులు, దుర్భాషలు వినా మరొకటి రాని కొడాలి నానిని. మరి నాని ఊరుకుంటారా? తన నోటికి పదును పెట్టారు. సునీల్ దియోదర్ ని పకోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన లాంటి నాయకుల వల్లే కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. దీంతో బీజేపీ మండి పడింది. సాధారణంగా నానిని విమర్శించడానికి కానీ, ఆయన విమర్శలకు స్పందించడానికి కానీ ఎవరూ పెద్దగా ఇష్టపడరు. బురదలో రాయి వేయడం ఎందుకని మిన్నకుంటారు. కానీ బీజేపీ అలా ఊరుకోలేదు. తీవ్రంగా స్పందించింది. సవాళ్లు విసిరింది. నాని వాచాలతకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్లుగా ఎదురుదాడికి దిగింది. గుడివాడలో అభివృద్ధి, వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు సవాల్ విసిరింది. ఇందుకు గన్నవరం బస్టాండ్ ను వేదికగా నిర్ణయించింది. మామూలుగా అయినే నాని ఇలాంటి సవాళ్లకు వెంటనే స్పందిస్తారు, సై అంటారు. కానీ బీజేపీ సవాల్ కు మాత్రం నాని నుంచి ఎటువంటి స్పందనా లేదు. నోటికి తాళం వేసుకున్నట్లు కూర్చున్నారు.

వైసీపీ అధిష్ఠానం నోరు నొక్కేసిందో.. లేక బీజేపీతో శతృత్వం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారో కానీ నాని మౌనమునిగా మారిపోయారు. అయితే బీజేపీ మాత్రం నానిని వదలడం లేదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. నోరెత్తితే ఊరుకోమన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయిన దానికీ కాని దానికీ బూతులతో విరుచుకుపడే నాని మౌనం వెనుక జగన్ హెచ్చరిక, మందలింపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కోపం వస్తే.. జగన్ పుట్టి మునుగుతుందన్న భయంతోనే వైసీపీ అధిష్ఠానం నాని నోటికి తాళం వేసిందంటున్నారు. 

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.