ఉమామహేశ్వరి ఆత్యహత్యకు ముందు ఏం జరిగిందంటే?
Publish Date:Aug 2, 2022
Advertisement
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆకస్మిక మృతి.. ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారంటూ మీడియాలో ఓ వైపు వార్తలు వెల్లువెత్తాయి. మరోవైపు ఆమె మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అందుకు సంబంధించిన నివేదికను వైద్యులు బుధవారం ఇవ్వనున్నారు. ఆమె మృతికి అనారోగ్యం, ఒంటరితనంతోపాటు తీవ్ర మానసిక ఒత్తిడే కారణమంటూ మీడియాలో వార్తలు సైతం హల్‌చల్ చేశాయి... చేస్తున్నాయి. ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం. ఎనిమిది మంది కుమారులు.. నలుగురు కుమార్తెలు కాగా.. అందులో ఉమామహేశ్వరి ఆఖరి అమ్మాయి. ఎన్టీఆర్ ఇంట పుట్టి.. ఇంత మంది మధ్య అల్లారి ముద్దుగా పెరిగిన ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం పట్ల.. ప్రపంచంలోని తెలుగువారంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి వారి ఆడపడుచుగా.. ఎన్టీఆర్ ఇంట పుట్టినా.. కోట్లాది రూపాయిలు ఆస్తులు పాస్తులు ఉన్నా... పిలిస్తే పలికే సోదరులు, సోదరిమణులున్నా.. ఉమామహేశ్వరిని మాత్రం గతం తాలుక జ్జాపకాలు.. నీడలా వెంటాడాయని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్.. టాలీవుడ్ వినిలాకాశంలో టాప్ హీరోగా వెలుగొందుతోన్న సమయంలో ఉమామహేశ్వరి జన్మించారు. దీంతో ఆమెను చాలా అల్లారు ముద్దుగా ఆయన చూసుకునే వారట. అయితే ఆమె కొద్దిగా పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఆమె తల్లి బసవతారకం క్యాన్సర్‌తో పోరాడుతూ.. మరణించారు. దీంతో ఎన్టీఆర్ ఇతర కుమార్తెలు పురందేశ్వరి, లోకేశ్వరిలు .. ఉమామహేశ్వరికి అన్ని తామై పెంచారట. ఆ తర్వాత ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం.. ఆ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్.... ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు ఉమామహేశ్వరికీ వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలో బంధువులు, సన్నిహితులు సూచించిన నరేంద్ర రాజన్‌కు ఉమామహేశ్వరిని ఇచ్చి వివాహం చేశారీ ఎన్టీఆర్. అయితే నరేంద్ర రాజన్ చేతిలో ఉమామహేశ్వరి తీవ్ర ఇబ్బందులు పడ్డారట. ఈ విషయం తెలుసుకోన్న ఎన్టీఆర్.. అతడితో ఉమామహేశ్వరికి విడాకులు ఇప్పించారనే తెలుస్తోంది. ఆ తర్వాత స్థల మార్పుకోసం ఉమామహేశ్వరి అమెరికా పయనమైయ్యారు. అక్కడే కొంత కాలం ఉన్నారు. ఆ క్రమంలో అక్కడే కంఠమనేని శ్రీనివాస ప్రసాద్.. ఉమామహేశ్వరికీ పరిచయం కావడం.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇరు కుటుంబాల్లోని పెద్దలకు తెలియజేయడంతో.. వీరి వివాహనికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో వీరు దంపతులుగా ఒక్కటైయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తె విశాల కాగా.. చిన్న కుమార్తె దీక్షిత. అయితే ఉమామహేశ్వరికి చిన్నతనంలో తల్లిని కోల్పోవడం.. ఆ తర్వాత తండ్రి రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత ఎన్టీఆర్ మరో వివాహం చేసుకోన్నారు. అయితే తన మొదటి వివాహం తాలుక విడాకుల ప్రభావం కూడా ఉమామహేశ్వరిపై తీవ్రంగా ఉండేదట. ఇవే ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేసినవట... అలాగే గత కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలను సైతం చుట్టుముట్టాయని.. వీటి నుంచి ఉమామహేశ్వరి బయట పడలేకపోయిందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చునని ఆమె సన్నిహితులు అబిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఈ ఉమా మహేశ్వరికి రాసి ఇచ్చిన ఇంట్లోనే ఉండేవారని.. ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకొంటున్నారు. మరోవైపు ఉమామహేశ్వరి చిన్న కుమార్తె దీక్షిత వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లోనే చాలా దశాబ్దాల పాటు దూరంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసి ముచ్చటించుకొన్నారు. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు కొన్ని గంటలు ముందు .. అంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో .. కొత్త దంపతులు దీక్షిత, ఆమె భర్తతో కలిసి.. జూబ్లీహిల్స్‌లోని తన తల్లి వద్దకు వచ్చారు. ఈ సందర్బంగా వారితో ఆమె బాగానే మాట్లాడిందట. అనంతరం ఆమె గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. తల్లి నిద్ర పోయేందుకు గదిలోకి వెళ్లిందని దీక్షిత భావించిందని.. ఆ తర్వాత అంటే 2 గంటల ప్రాంతంలో తల్లిని భోజనం చేసేందుకు లేపేందుకు గది తలుపు కొట్టగా.. ఉమామహేశ్వరి స్పందించలేదు. దీంతో వారు తలుపు పగలకొట్టగా.. తల్లీ ప్యాన్‌కు ఊరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో దీక్షిత వెంటనే 100 కో పోన్ చేయగా.. పోలీసులు హుటాహుటిన ఉమామహేశ్వరిని నివాసానికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోపైపు ఉమామహేశ్వరి మరణ వార్త తెలుసుకున్నా.. ఆమె సోదరులు, సోదరీమణులు.. వాళ్ల కుటుంబ సభ్యులు సైతం ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.
http://www.teluguone.com/news/content/what-happened-before-ntr-daughter-uma-maheswari-sucide-39-141077.html





