జగన్ హస్తిన పర్యటన ఏమైంది? మోడీ, షా అప్పాయింట్ మెంట్ దొరకలేదా?

Publish Date:Aug 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ఏమైంది? కొన్ని వారాల కిందట జగన్ హస్తిన పర్యటనకు వెడుతున్నారనీ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనీ వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ పర్యటన గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. దీంతో జగన్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి  వ్యక్తమైంది.   రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, ప్రధానంగా అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

హస్తిన పర్యటనలో జగన్ మోడీ,  షాలతో చర్చించే అంశాలేంటి?  జగన్, ఆయన పార్టీ నేతలు, సన్నిహిుతలు ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతమై, దర్యాప్తులు కొలిక్కి వస్తున్న వేళ ఆయన మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నారన్న వార్తలు ఉత్కంఠకు తెరలేపాయి.  జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో  జగన్ పర్యటన సంగతేమైందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయనకు మోడీ, అమిత్ షాలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. 

గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  కేంద్ర ప్రభుత్వంతో  వైసీపీ సఖ్యతగా వ్యవహరించింది. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు మోడీ, షాల అప్పాయింట్ దొరికేసేది. అయితే 2024 ఎన్నికల తరువాత నుంచి  పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.  

కేంద్రం కోరినా కోరకున్నా...జగన్, వైసీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటికీ బేషరతు మద్దతు ఇస్తున్నా.. కేంద్రం పెద్దలు ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇక రాష్ట్రంలో  కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై వరుస విచారణలు జరుపుతుంటే..  కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తులు, మద్యం కుంభకోణం కేసుల విచారణల్లో వేగం పెంచుతున్న పరిస్థితిప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్రం పెద్దలను కలిసి రక్షణ కోరేందుకు జగన్ మోడీ, షాల అప్పాయింట్ మెంట్ కోరారని రాజకీయవర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది.

కట్ చేస్తే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన ఊసెత్తడం లేదు. వైసీపీ సోషల్ మీడియాలో  కూడా ఆయన హస్తిన పర్యటనకు సంబంధించిన వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో మోడీ, షా జగన్ కు అప్పాయింట్ మెంట్  ఇవ్వలేదని స్పష్టమౌతోందని అంటున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో..  జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం  రాజకీయంగా ప్రతికూల సంకేతాలు ఇస్తుందన్న భావనతో మోడీ, షాలు జగన్ కు అప్పాయింట్ మెంట్ నిరాకరించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.    

రాబోయే రోజుల్లో ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏ దిశగా సాగుతుంది, కేంద్ర ప్రధాన నాయకులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విచారణ గతిని, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ పర్యటన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

What happend to Jagan delhi tour, Modi, Shah, Appointment, Cases, Nda, Telugudesham, Ap, TeluguOne

By
en-us Political News

  
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  
ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు.
వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.
ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఒక వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి.. తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు.
రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.
తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.
కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు, యువతలకు ప్రయోజనం చూకూర్చే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.