ఈ మూడేళ్లలో ఏం చేశారయ్యా?.. ఎమ్మెల్యే రక్షణనిథిని నిలదీసిన మహిళలు

Publish Date:May 17, 2022

Advertisement

గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమం.. ప్రభుత్వంపైనా, తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిథులపైనా తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి దొరికిన అవకాశంగా జనం భావిస్తున్నారు. ఇంత చేశాం, అంత చేశాం అంటూ చెప్పుకుందామనుకున్న ప్రభుత్వ లక్ష్యం ప్రజాగ్రహ ఉప్పెనలో కొట్టుకుపోతున్నది. ఎక్కడి కక్కడ ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను కడిగి పారేస్తున్నారు.  ఎన్టీఆర్ జిల్లా కోడూరులో మహిళలు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిథిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ మూడేళ్లలో మీ సర్కార్ చేసిన ఒక్కమంచి పనిని చెప్పవయ్యా అంటూ నిలదీశారు.

'ఒక మంచి పనైనా చేశారా' వైసిపి ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు ఉపయోగం లేని పథకాల పేరుతో కోట్లు అప్పలు చేసిన ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా  చూపమంటూ నిలదీశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదనీ, పక్కా గృహాల మంజూరు ఎక్కడనీ ప్రశ్నలు సంధించారు. వైసీపీ పథకాల లబ్ధిదారుల ఇళ్లకే గడప గడపకూ మన ప్రభుత్వాన్ని పరిమితం చేసినా వారి నుంచే నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఎమ్మెల్యేలూ, మంత్రులకు ఏం చెప్పాలో, వారిని ఎలా సముదాయించాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే రక్షణ నిధికి కోడూరులో ఎస్సీ కాలనీలో తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఎరక్కపోయి మీ పార్టీకి ఓటేసాం..  అంటూ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ఓటేశాం. మూడేళ్లుగా  రోడ్లు లేవు, పక్కాగృహాలు లేవు, తాగునీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ లేదు సరికదా నిరుపయోగ పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్నిఅప్పుల కుప్ప చేశారంటూ మహిళలు నిలదీశారు. అమ్మ ఒడి కోసం సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వృద్ధురాలు రెండేళ్లుగా పింఛను రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బియ్యం కార్డులు మంజూరు కాలేదని మరి కొందరు నిలదీశారు. 

కర్నూలుజిల్లాఅదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికీ దాదాపుగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నియోజకవర్గ పరిధిలోని విరుపాపురంలో ఆయనకు ప్రజాగ్రహ సెగ తగిలింది. ఆయనను మాట్లాడనివ్వకుండా జనం ప్రశ్నల వర్షం కురిపించారు. బియ్యం కార్డులు లేవు, పక్కా గృహాల మంజూరు లేదు. ఘనంగా సర్కార్ చెప్పుకుంటున్న పథకాలలోనూ వివక్షే. అన్నీ వాలంటీర్లే చేశారంటే మీరెందుకు అంటే సాయి ప్రసాద్ రెడ్డిని జనం నిలదీశారు. 

ఇక కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషాకు జనాగ్రహంతో చేదు అనుభవమే ఎదురైంది. 
సమస్యలు పట్టించుకోని, పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకంటూ ఆయనను అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు, కార్యకర్తల బలగాన్ని వెంటేసుకు వెళుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు జనాగ్రహ జ్వాలలను ఎదుర్కొనక తప్పడం లేదు.  విద్యుత్ కోతలపై జనం ప్రశల తూటాలకు ఉప ముఖ్యమంత్రి నిరుత్తరుడయ్యారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ నుంచి తన మందీ మార్బలంతో  జారుకున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు, ఆందోళనలతో గడప గడప కూ కార్యక్రమంలో అడుగు బయటకు పెట్టాలంటేనే వైసీపీ ప్రజా ప్రతినిథులు జంకుతున్నారు.

ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించి ముగించేద్దామా అన్న తొందర ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఈ కార్యక్రమాన్ని తమ తమ పరిధిలో ప్రారంభించనే లేదు. ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనడం కంటే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించడమే మేలని తమ ఆంతరంగికుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.