ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగింది? ఏం జరుగుతోంది?

Publish Date:Jul 20, 2026

Advertisement

 తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్

నిన్న మొన్నటి వరకూ ఒక సెలబ్రిటీగా మీడియా, యువత గొప్పగా చెప్పిన ఉదయ్ కృష్ణారెడ్డి.. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సస్పెండ్ అయ్యారు.  ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ ఆయనను పెంచి పెద్ద చేసింది. అత్యంత పేదరికంలో పెరిగిన ఉదయ్, 2013లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఒక సీఐ ద్వారా ఎదురైన తీవ్ర అవమానమే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఎలాగైనా అంతకంటే ఉన్నతమైన సివిల్ సర్వెంట్‌గా మారాలనే దృఢ సంకల్పంతో 2018వ సంవత్సరంలో తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సాధన చేసి ఐపీఎస్ సాధించారు. అటువంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడి నేపథ్యం గురించి తెలుగువన్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ అనలిస్ట్ కందుల రమేష్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 

ఉదయ్ కృష్ణారెడ్డి.. ఐపీఎస్ సాధించడానికి చేసిన ప్రయాణం  అంత సులువుగా సాగలేదు. గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం చదువు కావడంతో మొదటి మూడు ప్రయత్నాలలో ఉదయ్ కృష్ణారెడ్డికి  నిరాశే ఎదురైంది. నాలుగో ప్రయత్నంలో వేరే సర్వీస్ వచ్చినప్పటికీ..  ఆశించిన ఐపీఎస్ మాత్రం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా..  రోజుకు 10 నుండి 12 గంటల పాటు  కష్టపడి చదివి, ఐదో ప్రయత్నంలో ఆల్ ఇండియా 365వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ కావాలని కన్న కలలను సాకారం చేసుకున్నారు.   హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతున్నారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో, ఆయన జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటకకు చెందిన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డిపై  లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. తనను గదిలో బంధించి, కత్తితో బెదిరించాడని, లైంగికంగా వేధించాడని,  ప్రైవసీకి భంగం కలిగించాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై సెక్షన్ 74, 75, 77 (వైరిజం), 78 (స్టాకింగ్), 79, 127(2) (అక్రమ బంధనం), 115(2), 351(2) తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E మరియు 67A కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీస్ అకాడమీలో పని ప్రదేశాల్లో మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఉన్నప్పటికీ, ఫిర్యాదులో తీవ్రమైన క్రిమినల్ అంశాలు ఉండటంతో ఈ కేసు నేరుగా  పోలీస్ స్టేషన్‌కు చేరింది.

ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ  అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై   కేసు పెడతానని మీడియాకు  మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న   మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక ఆదర్శవంతమైన ప్రేరణాత్మక కథగా నిలిచిన యువ ఐపీఎస్ అధికారి ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం, ఆత్మహత్యా యత్నం చేసి ఆస్పత్రి పాలవ్వడం  తీవ్ర కలకలం రేపుతోంది.

Uday Krishna Reddy IPS, Trainee IPS Officer, NPA Hyderabad, Attapur Police Case, Uday Krishna Reddy Suicide Attempt

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.