తన గొంతు పనికి రాదన్నందుకు లత ఏం చేసిందో తెలుసా?

Publish Date:Feb 6, 2022

Advertisement

లెజండరీ ఆర్టిస్టులు తొలిరోజుల్లో ఎదుర్కొన్న ఛీత్కారాలే లతా మంగేష్కర్ కూడా ఎదుర్కొన్నారు. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. తన గొంతు మీద కామెంట్లు చేసిన విమర్శకుల నోళ్లు మూయించాలంటే లత చాలా పెద్ద కసరత్తే చేశారు. గొంతును ఎంతో మెలి పెట్టారు.  పలుకుల్లో స్థానికత తొంగిచూసేందుకు తనకు తెలియని ఇతర భాషల్ని కూడా నేర్చుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి లెజండ్ ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే లత ఎంత కష్టపడిందో కనీసం తెలుసుకోవాలి. 

1929 సెప్టెంబర్ 28 జన్మించిన లతామంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్. తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు హేమ. ఆ తరువాతనే లతగా మారారు. పేరుకు తగినట్టుగానే ఆమె గొంతులో, పాటల్లో లాలిత్యం నింపుకున్నారు లతా దీదీ. తండ్రి క్లాసికల్ సింగర్, థియేటర్ యాక్టర్ కాబట్టి... తండ్రి నుంచి సహజంగానే సంగీతం అబ్బింది... అలాగే సినిమాల్లో అవకాశాలకూ మార్గం సుగమంగానే ఉంది. అయితే అవకాశాలు రావచ్చునేమో కానీ..  వాటని నిలబెట్టుకునేందుకు మాత్రం లత చాలానే కష్టపడాల్సి వచ్చింది. లత 13వ ఏటనే తండ్రి పోయాక వినాయక దామోదర్ లత కుటుంబానికి అండగా నిలిచాడు. వినాయక్... లత తండ్రికి ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పటికే ఆయనకు నవయుగ చిత్రపథ్ మూవీ కంపెనీ ఉండేది. ఆ కంపెనీని ముంబైకి తరలించడంతో లత అండ్ ఫ్యామిలీ కూడా ముంబైకి రావాల్సి వచ్చింది. మూవీల్లో నిలదొక్కుకోవడానికి ముంబై వచ్చాక హిందూస్తానీ క్లాసికల్ సంగీతాన్ని అభ్యాసం చేశారు లత. అవకాశాలు వస్తున్న సమయానికే వినాయక్ కన్నుమూశారు. 

అప్పటికే సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న గులాం హైదర్.. దీనానాథ్ ఫ్యామిలీకి మిత్రుడు. దీంతో గులాం హైదర్ లతకు బాసటగా నిలిచాడు. ఆమెకు గాయనిగా అవకాశాలు ఇప్పించేందుకు అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న నిర్మాత శశిధర్ ముఖర్జీకి దగ్గరకు తీసుకెళ్లాడు. లత వాయిస్ విన్న తరువాత శశిధర్ తిరస్కరించాడు. ఈమె గొంతు చాలా లేతగా ఉంది. పసిపిల్లల గొంతులా ఉంది. సినిమాకు పనికి రాదు పొమ్మన్నాడు. అయితే లతలో దాగి ఉన్న టాలెంట్ ను గుర్తించి, పూర్తి కాన్ఫిడెన్స్ మీద ఉన్న గులాం హైదర్ అప్సెట్ అయ్యాడు. ఈమె గొంతు కోసం నిర్మాతలంతా క్యూ కట్టే రోజు వస్తుందంటూ లతను తీసుకొని బయటికొచ్చేశాడు. గులాం హైదర్ అంచనాలు తప్పలేదు. లత ఎంతో కష్టపడి ఎన్నో రకాల శ్రుతుల్ని మేళవించి అద్భుతంగా రాణించింది. అందుకే 2013లో తన 84వ పుట్టిన రోజు సందర్భంగా గులాం హైదర్ ను  తన గాడ్ ఫాదర్ గా పేర్కొన్నారు లత. 

కాంట్రవర్సీలు
1) గిన్నిస్ వాల్డ్ రికార్డుల్లో లత పేరెక్కడంపై ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ విభేదించారు. 1974లో గిన్నీస్ బుక్ వారు లత అప్పటికి 25 వేల పాటలు పాడి రికార్డు సృష్టించినట్లు నమోదు చేశారు. అయితే మహమ్మద్ రఫీ తాను 28 వేల పాటలు పాడానని క్లెయిమ్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. ఇక రఫీ చనిపోయాక 1984లో లత అత్యధిక పాటలు పాడిన గాయనిగా గుర్తించడమే కాక రఫీ చేసిన క్లెయిమ్ ను కూడా నమోదు చేయడం విశేషం. 84 నాటికి లత కనీసం 30 వేల పాటలు పాడిందంటూ సవరించుకుంది. 

2) ఈ రోజుల్లోనే ప్లే బ్యాక్ సింగర్లకు తగిన గుర్తింపు గానీ, పారితోషికం గానీ అందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ రోజుల్లో సంగతి చెప్పనక్కర్లేదు. లత తమకు కూడా రాయల్టీ కావాలంటూ గొంతెత్తింది. అదే ఆ తరువాత సింగర్లకు కొండంత బలాన్నిచ్చిందంటారు ఇండస్ట్రీ పెద్దలు.

3) ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ తో దాదాపు నాలుగేళ్ల పాటు మాట్లాడటం మానేసింది. లత ఎదుగుదలకు తానే కారకుడినని బయట చెప్పుకోవడంతోనే లత ఈ పని చేసిందంటారు. 

4) తన చెల్లెలైన మరో గాయని ఆశా భోంస్లేతో వర్క్ చేశాడని ఓపీ నయ్యర్ తో పని చేయడానికి ససేమిరా అంది లత. 

ఇక లత జీవితంలో అవార్డులకు, రివార్డులకు లెక్కే లేదు. గానకోకిల, క్వీన్ ఆఫ్ మెలోడీ అనేవి ఆమెకు సరిగ్గా సరిపోయే బిరుదులు. 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో భారతరత్న పేరుతో అత్యున్నత పౌర పురస్కారం దక్కాయి. పద్మభూషణ్, పద్మ విభూషణ్ లతో పాటు ఇండస్ట్రీలో ఉండే అనేక అవార్డులు అందుకున్నారు. అంతేకాదు... సంగీతంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత రెండోసారి భారతరత్న అయిన సింగర్ కావడం విశేషం. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో పాడే అవకాశం దక్కించుకున్న మొదటి భారతీయ గాయని లతనే కావడం ఇంకో విశేషం. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పుట్టిన లత... గుజరాత్ వ్యాపారవేత్తలతో రక్త సంబంధం కలిగి ఉంది. అమ్మ తరఫు తండ్రి గుజరాతీ బడా వ్యాపారవేత్తలు. అటువైపు తండ్రి నుంచి చిన్నప్పుడే ఫోక్ సాంగ్స్  నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు లత. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.