ఏ లోపం వల్ల బట్టతల వస్తుంది తెలుసా?

Publish Date:Feb 26, 2026

Advertisement


నేటికాలంలో అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్న సమస్య బట్టతల.  తల మీద జుట్టు బాగా రాలిపోయి తల చర్మం బయటికి కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టతల అని అంటారు.  బట్టతల వచ్చాక ఆ ప్రాంతంలో ఇక వెంట్రుకలు తిరిగి పెరగవు.  ఒకప్పుడు బట్టతల పెద్దవారికి మాత్రమే వచ్చేది.  కానీ నేటికాలంలో మాత్రం అది పూర్తీగా విభిన్నంగా ఉంది.  చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడేవారు ఉన్నారు. అయితే బట్టతల రావడానికి శరీరంలో కొన్ని లోపాలు కారణం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే..

జుట్టు నిర్మాణం..

జుట్టు నిర్మాణం ప్రధానంగా ప్రోటీన్ తో రూపొందించబడి ఉంటుంది. ఆహారం సరిగా లేకపోయినా,  సరైన ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ కాలం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా క్రమంగా జుట్టు పలుచబడి,  రాలిపోవడానికి దారితీస్తుంది. ఇది ఎక్కువ కాలం సాగితే బట్టతలగా మారే అవకాశం ఉంటుంది.

పురుషుల్లో బట్టతల..

పురుషుల్లో బట్టతల అనేది జన్యుశాస్త్రం,  హార్మోన్ల మార్పుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  తండ్రి లేదా తాత వంటి వారికి బట్టతల ఉంటే.. కాలక్రమేణా పిల్లలకు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.

ఒత్తిడి సమస్యలు..

ఒత్తిడి,  నిద్ర సమస్యలు ఉన్నవారిలో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.  ఒత్తిడి,  ఆందోళన కారణంగా  ఒత్తిడి హార్మోన్ పెరిగి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అలాగే శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా బట్టతలకు దారితీస్తుంది.

విటమిన్స్..

ప్రోటీన్ మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలలో విటమిన్-డి,  ఐరన్, జింక్, బయోటిన్ అని పిలువబడే విటమిన్-బి17 కూడా కీలకపాత్ర పోషిస్తాయి.  ఇవి లోపించడం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం  ఉంటుంది.

మగాళ్లకే కాదు..

బట్టతల అనేది మగాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అనుకుంటే పొరపాటు.  ఇది ఆడవాళ్లకు కూడా వస్తుంది.  ఆడవాళ్లలో జుట్టు పలుచబడి,  తలమీద చర్మం బయటకు కనిపిస్తూ,  తల వెంట్రుకల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.   దీన్ని ఆడవాళ్లలో బట్టతలగా పరిగణిస్తారు.

                                          *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.