పింకీ ఫింగర్ సిండ్రోమ్.. మొబైల్ వాడేవారిలో వచ్చే ఈ సమస్య గురించి తెలుసా.!

Publish Date:Aug 1, 2026

Advertisement

 


టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఇవన్నీ చిన్నవే అని కూడా అనుకుంటారు. కానీ అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. చేతి  వేళ్లలో ఎప్పుడైనా ఒక రకమైన వింత అనుభూతి,  పట్టులో మార్పు, లేదా తరచుగా అసౌకర్యం వంటివి  అనుభవిస్తే, దాన్ని 'పింకీ ఫింగర్' సిండ్రోమ్ అని అంటారట.  చాలామందికి దీని గురించి తెలియదు.  అయితే ఈ సమస్య ఎవరూ నిర్లక్ష్యం చేయకూడని సమస్య.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
 

పింకీ ఫింగర్ సిండ్రోమ్ అంటే..

పింకీ ఫింగర్ సిండ్రోమ్ అనేది చిటికెన వేలు , దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేసే ఒక సమస్య. ఇది తరచుగా ఉల్నార్ నరంపై ఒత్తిడి వలన సంభవిస్తుంది.  ఈ నరం చిటికెన వేలుకు , ఉంగరపు వేలులోని కొన్ని భాగాలకు స్పర్శ జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ నరంపై ఒత్తిడి పడినప్పుడు, అది వేళ్లలో జలదరింపు, తిమ్మిరి , నొప్పికి కారణమవుతుంది.

పింకీ ఫింగర్ సిండ్రోమ్ లక్షణాలు..

చిటికెన వేలులో తిమ్మిరి లేదా చిమచిమలాడటం, చేతిలో బలహీనతగా అనిపించడం ఈ సమస్యలో ప్రదాన లక్షణం.  అలాగే..  వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నా,  వేళ్లలో నొప్పి లేదా మంటగా అనిపించడం. భుజాన్ని ఎక్కువసేపు వంచి ఉంచితే సమస్య పెరుగడం వంటి లక్షణాలు ఉంటాయి.

పింకీ ఫింగర్ సిండ్రోమ్ ఎలా నివారించాలి?

 చేతులను ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉంచకూడదు,  మొబైల్ వాడేటప్పుడు సరైన పొజిషన్ లో వాడాలి.
 అప్పుడప్పుడు  చేతులను, వేళ్లను సాగదీయాలి. మోచేతిపై నిరంతరం ఒత్తిడి పెట్టడం మానుకోవాలి. నొప్పి లేదా తిమ్మిరి ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

 పింకీ ఫింగర్ సిండ్రోమ్  ప్రారంభ లక్షణాలు తరచుగా తేలికపాటివిగా ఉంటాయి, కాబట్టి ఈ లక్షణాలు సాధారణ అలసట లేదా అధికంగా పని చేయడం వల్ల    కనిపిస్తున్నాయేమో అని లైట్ గా తీసుకుంటారు.  అయితే, చిటికెన వేలు లేదా చేతితో సమస్యలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

కొంతమందిలో సమస్య ముదిరే కొద్దీ, వారు చేతి కండరాలలో బలహీనత, వేళ్లను కదపడంలో ఇబ్బంది లేదా మంటగా అనిపించడం వంటి లక్షణాలను కూడా ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు చాలా రోజులు లేదా వారాల పాటు కొనసాగితే న్యూరాలజిస్ట్ లేదా ఆర్థోపెడిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.

అవసరమైతే వైద్యుడు శారీరక పరీక్ష, నరాల పరీక్ష లేదా ఇతర పరీక్షల ద్వారా సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలుగుతారు.  సకాలంలో చికిత్స చేయడం ద్వారా నరాలపై ఒత్తిడిని తగ్గించి, పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు. అందువల్ల చేతులు లేదా వేళ్లలో  మార్పులను  గమనిస్తే వాటిని విస్మరించకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.

 


                             *రూపశ్రీ.

 

By
en-us Political News

  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.