ఫైబర్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Publish Date:May 25, 2023
Advertisement
ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం గురించి ప్రతి వైద్యుడు, ప్రతి పోషకాహార నిపుణుడు, ఆఖకి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతాడు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా విషయాలు వినే ఉంటారు. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే.. అయితే ఫైబర్ ఇలా కడుపుకు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఇతర ప్రయోజనలు కూడా చేకూరుస్తుందని మీకు తెలుసా?? బరువు తగ్గడం నుండి డయాబెటిస్ సమస్యలను తగ్గించడం, మెదడును ఆరోగ్యంగా ఉంచడం వరకు దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందుకే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ శరీరంలో చక్కెర వాడకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది ఆకలిని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి అవసరం. పిల్లలు మరియు పెద్దలకు మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 25 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరం, కానీ చాలా మందికి రోజుకు 15 గ్రాములు మాత్రమే ఆహారం ద్వారా ఫైబర్ అందుతూ ఉంటుంది. ఫైబర్ బాగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చునంటే.. చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, తగినంత ఫైబర్ తీసుకుంటే, అది చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీ శరీరానికి కావలసినంత ఫైబర్ తీసుకునే వారిలో చిత్తవైకల్యం తక్కువగా ఉంటుందని తేలింది.ఆహారంలో తక్కువ తీసుకునేవారిలో డిమెన్షియా రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు సగటున 20 గ్రాముల కంటే తక్కువ ఫైబర్ తీసుకునేవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, అరటిపండ్లు.. బెస్టు.. అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉన్నా అవి సగటు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అలాంటి వారు అనేక ఇతర పండ్ల నుండి ఫైబర్ పొందవచ్చు, అరటిపండ్లు, యాపిల్స్ ఇందులో ముఖ్యమైనవి. యాపిల్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.. అదేవిధంగా, అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. అరటిపండు తినడం ఫైబర్, ప్రోటీన్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల శనగలు.. ఫైబర్, ప్రోటీన్‌లకు అద్భుతమైన మూలం నల్ల శనగలు. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది శాకాహారులకు ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి బెస్ట్ ఎంపిక. ఆహారంలో నల్లశనగలను చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను సరిగ్గా ఉంచడంతో పాటు కండరాలకు ప్రోటీన్‌ను సులభంగా అందేలా చూసుకోవచ్చు. ◆నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/what-are-the-benefits-of-fiber-34-155865.html





