జాతీయ పండుగలనగా నేమి?

Publish Date:Aug 15, 2012

Advertisement

జాతీయ పండుగలంటే ‘స్వాతంత్య్రదినం, గణతంత్రదినం, గాంధీజయంతి...’ తదితరాలు చెప్పేస్తారు. అయితే 65 ఏళ్ళ ప్రజాస్వామ్యదేశంలో ప్రకటనలకే తప్ప ఆయా పండుగలను జాతీయ పండుగలుగా గుర్తిస్తూ నేటివరకూ అధికారిక ఉత్తర్వులు రాలేదంటే మన పాలకుల నిర్లక్ష్యానికి, అలక్ష్యానికి అద్దంపడుతోంది. పైన తెలిపినట్లు ఏ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్‌ 2లను జాతీయపండుగలుగా ప్రకటిస్తున్నారు అని ఆ ఉత్తర్వుల నకలును పంపించండి’ అంటూ సమాచార హక్కుచట్టం పరిధిలో పదేళ్ళ ఓ బాలిక కోరగా, అలాంటి ఉత్తర్వులు ఏదీ జారీ కాలేదని తెలుపగా, తిరిగి ఆ మూడు రోజులను జాతీయపండుగదినాలుగా ప్రకటించినట్లు పాఠ్యపుస్తకాలలో ఉంది కనుక పంపించండి’ అని మళ్ళీ అప్పీలు చేసుకుంటే సంబంధిత సిబ్బంది, శిక్షణ శాఖలోని ఆర్కైవ్స్‌ విభాగం సిబ్బంది పైళ్ళన్నిటిని వెతికి వెతికి అసలు అలాంటి ఉత్తర్వు ఏదీ లేదని తేల్చి చెప్పారు. దాంతో ఆ బాలిక రాష్ట్రపతికి, ప్రధానికి వినతి పత్రం సమర్పించింది.



  ఈ సంఘటనను బట్టి చూస్తే పాలకుల పనితీరు, అధికారుల అలసత్వం తెలుస్తోంది.  ఇదంతా చూస్తుంటే నాయకులు ఎన్నిక కావడానికి తప్పనిసరైన ఎన్నికల నోటీఫికేషన్‌ తప్ప ఏదీ సక్రమంగా అమలుకావని అర్ధం చేసుకోవచ్చు. ప్రజలకు అద్దంలో చందమామను చూపించే ప్రయత్నాలే తప్ప అసలు ‘విషయం’ ఏదీ వుండదని, మనదేశంలో జాతిపితగా పిలుచుకునే గాంధీగారికి  జాతిపిత పేరు  ఎప్పుడు వచ్చింది? ఎవరిచ్చారు? ఏ సందర్భంలో ఆయన్ను  ఈవిధంగా సంబోధించారంటూ ఓ తొమ్మిదో తరగతి అమ్మాయి ఇటీవల అడిగిన ప్రశ్నకు  కూడా ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలేకపోయింది మరి!  జాతీయ పండుగలో లెక్కా!

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.