తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. అసలీ 'జీవో 111' అంటే ఏంటి?

Publish Date:Jun 8, 2020

Advertisement

ప్రస్తుతం తెలంగాణలో 'జీవో 111' చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ 'జీవో 111' కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్లు తిప్పడంతో రేవంత్ అరెస్ట్ కూడా అయ్యారు. తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే, తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో.. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకే చాలామందికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, సామాన్యులు మాత్రం అసలు ఈ 'జీవో 111' అంటే ఏంటి?.. 'జీవో 111' కి విరుద్ధంగా నిర్మాణాలు ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు.

హైదరాబాద్ ‌కు వరదలు రాకుండా దాదాపు వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. ఈ రిజర్వాయర్లు అప్పట్లో సుమారు పది లక్షల మంది దాహాన్ని తీర్చేవి. అయితే, నగరం నానాటికీ విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించి.. ఎన్నో​ నిర్మాణాలు వెలిశాయి. దీంతో, సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రెండు రిజర్వాయర్లు కనుమరుగైపోతాయనే ఆందోళన నుంచే 'జీవో 111' పుట్టింది.

ఆ రెండు రిజర్వాయర్లను కాపాడే చర్యలు చేపట్టమని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. 1996లో నాటి ప్రభుత్వం జీవో 111ని జారీ చేసింది. దీని ప్రకారం ఆ రెండు రిజర్వాయర్ల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. ఒక స్థలంలో పది శాతం మేరకు, కేవలం నివాసం కోసం మాత్రమే.. అది కూడా జీ ప్లస్‌ 2(మొత్తంగా మూడంతస్తులు)కి మించకుండా నిర్మాణం చేపట్టాలి. 

ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని ఆరు మండలాలు శంషాబాద్‌, మొయినాబాద్‌, షాబాద్‌, శంకరపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల కు 'జీవో 111' వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి. ఈ 84 గ్రామాలలో జీవో 111 కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ, బడా బాబులు మాత్రం జీవో 111 నిబంధనలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం జీవో 111 పరిధిలో 13 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అంచనా. 4,000 వరకు ఫామ్‌హౌస్​లు, 50 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండొచ్చని తెలుస్తోంది. జీ ప్లస్‌ టూ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఐదు, ఆపై అంతస్తులతో కట్టిన అక్రమ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. మరి ఇప్పుడు అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పని పడతారేమో చూడాలి.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.