విత్త మంత్రిగారూ.. బొమ్మల కొలువుపై మోడీని అడిగారా?

Publish Date:Sep 6, 2022

Advertisement

కేంద్ర పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు కచ్చితంగా మోడీ ఫొటోను పెట్టాల్సిందే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేశాయి. గతంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటోలను రేషన్ షాపుల్లో ఉంచాయా అని తెలంగాణ మంత్రులు నిలదీస్తున్నారు.

ఒకరి తరువాత ఒకరుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ముప్పేట దాడి చేస్తున్నారు. విమర్శలు చేసేయడం ఆ తరువాత నాలుక కరుచుకుని మౌనం దాల్చడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆగ్రహ జ్వాలలకు తలవంచి ఉపసంహరించుకున్న సమయంలో మోడీ రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని వారీసందర్బంగా గుర్తు చేస్తున్నారు.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ తెలంగాణ పర్యటన సందర్భంగా రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటోపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి.

తెలంగాణ మంత్రులందరూ కేంద్ర విత్త మంత్రి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అయితే నిర్మలా సీతారామన్ కు మోడీ బొమ్మల కొలువు కావాలంటే ముందు ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఏం చేశారో తెలుసుకోవాలని హితవు పలికారు. నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో  ఆ రాష్ట్రంలోని  రేషన్‌ షాపుల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా? తెలుసుకుని ఆ తరువాత తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో మోడీ ఫొటో గురించి అడగాలని సూచించారు. కేంద్రం సమాఖ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలతో రాజకీయం చేద్దామంటే నడవదని హెచ్చరించారు.  ప్రజలు టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌ పాలనపై, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు.   తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసుననీ, కేంద్ర విత్తమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారనీ విమర్శించారు.  విభజన హామీలు అమలు చేయకపోవడం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన రూ.7,103 కోట్లు ఇవ్వకపోవడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, ఐటీఐఆర్‌, నిమ్స్ రద్దు, మెడికల్‌ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయకపోవడం వంటివి వివక్ష కాదా? అని ప్రశ్నించారు.

వీధి రౌడీల్లా రేషన్ షాపుల వద్ద గలాటా చేయడం కాదనీ, దమ్ముంటూ అంశాల వారీగా చర్చకు రావాలనీ సవాల్ చేశారు.  పథకాల్లో కేంద్ర నిధులను వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్‌ మాట్లాడటం చెప్పేటందుకే  బీజేపీకి నీతులు గుర్తుకువస్తాయన్నట్లుగా ఉందన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో ఆయన ఫొటో పెట్టారా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం కేంద్రం ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. మోదీ హయాంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేశారు. ఉన్న పథకాల్లో కేంద్రం నిధుల వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచారు. ఇందులో కొన్ని పథకాల లక్ష్యాలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేనేలేవు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి   భారం మోపడం వినా కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఏమీ లేదని హరీష్ రావు అన్నారు.

పనికి ఆహార పథకం వంటి మంచి పథకాలకూ కొర్రీలు పెట్టి, నిధులు తగ్గించి కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని  విమర్శించారు. ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని పునఃసమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు గురించి మీడియా ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి నిర్మల సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హకు కేంద్రానికి ఉన్నదని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలా అప్పులు చేస్తున్నదని ప్రశ్నించారు.  కేంద్రానికి  రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిందా?  అని నిలదీశారు. కార్పొరేట్లకు చెందిన  లక్షల కోట్ల రుణాలను ఎవరి ఆమోదంతో రద్దు చేశారో దేశ ప్రజలకు కేంద్రం, మోడీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

 ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయలేదని చెప్పడాన్ని తప్పుపట్టిన హరీష్ రావు డీపీఆర్‌ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.