ఈ మార్పు .. దేనికి సంకేతం ?

Publish Date:Jan 12, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్  శాంతి కుమారి ఎంపిక అనూహ్యమే, అసలు రేసులోనే  లేని ఆమెను ముఖ్యమంత్రి ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి, ఆమెకు కూడా ఇది సర్ప్రైజ్  కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తప్ప మరొకరు అలోచించనైనా ఆలోచించ లేరు. అవి ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. గతంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని  ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్పుడు ఇలాగే అందరూ అవాక్కయ్యారు. అలాగే ఇప్పడు సీఎస్ గా  శాంతి కుమారి ఎంపిక కూడా చాలా మందిని చాలా రకాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే అంతకంటే విచిత్ర్రం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిష్క్రమణ. నిజానికి, సోమేశ్ కుమార్ కోర్టు ఆదేశాలను ఇలా హుందాగా స్వీకరిస్తారని కానీ..  మౌనంగా ఉంటారని కానీ..  కోర్టు పొమ్మనగానే, జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లి పోతారని కానీ ఎవరూ ఉహించలేదు. హై డ్రామా జరుగుతుందనే అందరూ ఉహించారు. మీడియా  అదే ఆశించింది. అయితే  సోమేశ్ కుమార్  అందరినీ  డిసప్పాయింట్  చేస్తూ ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కోర్టు గీసిన గీత దాటకుండా నడుచుకుంటూ వెళ్లి పోయారు. 

అయితే ఇప్పడు అదే ఆయన అలా జేబులో చేతులు పెట్టుకుని మౌనగా ఏపీకి వెళ్లి పోవడమే, అందరినీ అంతు చిక్కని ప్రశ్నగా వెంటాడుతోంది. అవును.. ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు ? ముఖ్యమంత్రి కేసేఆర్  తమకు అన్ని విధాల అనుకకూలమైన ఆయన్ని ఎందుకు అలా.. వెళ్ళనిచ్చారు. ఎందుకు ఒంటరిగా వదిలేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడు తున్నాయి. 

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక్క క్షణం వృధా చేయకుండా అత్యంత వేగంగా పావులు కదిపింది. తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి సోమేశ్‌ కుమార్‌కు వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశిస్తూ  ఉత్తర్వులు జరీ చేసింది. కోర్టు తీర్పు వచ్చిన రోజునే  మంగళవారం (జనవరి 10) ఈమేరకు  కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు అంటే గురువారం లోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది.

ఒక విధంగా ఇది ఊహించిందే  ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌ పైనే కోర్టు తీర్పు నిచ్చింది. 

మరోవంక రాజకీయ కోణంలో చూసినా సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఇష్టుడు కావడం వలన ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పరుగులు తీయడాన్ని  అర్థం చేసుకోవచ్చును.కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే వేగంగా చక చకా నిర్ణయాలు తీసుకున్నారు.  సోమేశ్ కుమార్ అటో ఇటో ఎటో తేల్చుకోక ముందే కొత్త సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది  చాలా మందిని చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంచు మించుగా మూడున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి నోట్లో నాలుకలా అన్ని కార్యాలు చక్కపెట్టిన సోమేశ్ కుమార్ కు కనీసం ఒక సాంప్రదాయ వీడ్కోలు అయినా లేకుండానే ఎందుకు అలా వదిలేశారు అనేది పొలిటికల్ ఆఫీషియల్ సర్కిల్స్ లో మిలియన్ డాలర్ల ‘చర్చ;’ గా మారింది.    

నిజానికి కోర్టు తీర్పును ముందుగానే ఊహించిన సోమేశ్ కుమార్ కు, అదే జరిగితే ఏమి చేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉందనే ప్రచారం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన తన పోస్టుకు రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్దేశం, ఆసక్తి ఆయనకు ఏమాత్రం లేవని వార్తలొచ్చాయి. అంతే కాకుండా ఆయన సర్వీస్ ఇంకా నిండా సంవత్సరం కుడా లేదు. ఈ ఏడాది అంటే 2023 డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగుస్తుంది. కనుక  ఇంత తక్కువకాలం కోసం ఏపీకి వెళ్లి  చిన్న పోస్టులో కొనసాగడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేస్తారని చర్చ కూడా జరిగింది. అనంతరం తెలంగాణ సర్కారు ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. నిజానికి సోమేశ్‌కుమార్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి నుంచీ  సత్సంభాదాలే ఉన్నాయి కనుక ఆయన ఐఏఎస్ గా రాజీనామా చేసినా,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఆయన  సేవలను సలహాదారు గానో, మరో విధంగానో ఎక్కడో అక్కడ తప్పకుండా  ఉపయోగించు కుంటారనే ప్రచారం జరిగింది. 

కానీ  అవేవీ లేకుండా సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీన్ మారిపోయింది. కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల లోగానే,  కొత్త సీఎస్ నియామకం జరిగిపోయింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి పేరు మీడియాకు తెలియడం, ఆమె కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే ఎందుకిలా జరిగింది? మాజీ సీస్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంతలా  ఉదాసీనంగా ఉన్నారు ...? కేంద్రంతో మరో వివాదం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మౌనంగా ఉండిపోయారా... ఈ గుణాత్మక మార్పుకు సిబిఐ , ఈడీ కేసులు, విచారణలకు ఏమైనా సంబంధం వుందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు

By
en-us Political News

  
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.