Publish Date:Nov 25, 2013
భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత కోహ్లి 99, ధోని 51 నాటౌట్ గా నిలిచి ఇండియాకు 288 పరుగులను అందించారు.
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చార్లెస్ 12, ఆతరువాత వచ్చిన శామ్యూల్స్ 8 పరుగులు చేసి వెంటనే అవుటయ్యారు. ఈ స్థితిలో విండీస్ ను పావెల్, డారెన్ బ్రావో శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత సిమన్స్ 62, డారెన్ సామి 63 పరుగులు చేసి వెస్టిండీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో విశాఖలో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/west-indies-beat-india-by-2-wickets-36-27769.html
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్‌లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.