మళ్లీ దీదీకే బెంగాల్ పట్టం?

Publish Date:Apr 29, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశమంతా ఇప్పుడు కోల్‌కతా వైపు ఆసక్తిగా చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల చివరి విడత ఓటింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ మీడియా సంస్థలు,  సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. బెంగాల్ పీఠంపై మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   జెండా ఎగురవేస్తుందా?  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ) అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠకు ఈ సర్వేలు మరింత ఆజ్యం పోశాయి.

వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. బెంగాల్ పోరు హోరా  సాగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా  యాక్సిస్ మై ఇండియా'తన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా..  బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక  సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం టీఎంసీకి 148 నుంచి 160 స్థానాలు, బీజేపీకి 120 నుంచి 135 స్థానాలు దక్కుతాయి. 

అదలా ఉండగా.. కొన్ని సర్వేలు బెంగాల్‌లో కమలం వికాసం తథ్యమని పేర్కొన్నాయి.  చాణక్య స్ట్రాటజీస్,  జన్ కీ బాత్ వంటి సంస్థల సర్వేలు బెంగాల్ లో అధికారం బీజేపీకే అని పేర్కొన్నాయి.  చాణక్య అంచనాల ప్రకారం బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా.. , టీఎంసీకి 130 నుంచి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక  పీ-మార్క్   సర్వే అయితే బీజేపీకి గరిష్టంగా 175 స్థానాలు రావచ్చని..  టీఎంసీ.. 118 నుంచి 138 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది.

ఇక కొన్ని సర్వేలైతే..  బెంగాల్ లో టీఎమ్సీ, బీజేపీ మధ్య తేడా అత్యంత స్వల్పమని తేల్చాయి.  పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్  సగటు అంచనాల ప్రకారం టీఎంసీ 144 స్థానాలు, బీజేపీ 143 స్థానాలు సాధించవచ్చని పేర్కొనడం గమనార్హం. అంటే ఇక్కడ కేవలం ఒక్క సీటు తేడాతో అధికారం ఎవరికి దక్కుతుందనేది  తేలే అవకాశం కనిపిస్తోంది. టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ మాత్రం మమతా బెనర్జీకే  ఆధిక్యం ఉంటుందనీ.. ఆ పార్టీ 155 నుంచి 170 స్థానాలలో విజయం సాధిస్తుందనీ అంచనా వేసింది. 

మొత్తంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచీ ఉద్రిక్తతలు కొనసాగాయి.  మమతా బెనర్జీ తన సొంత ఇలాకాను కాపాడుకోవడానికీ,  కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోదీ బెంగాల్‌లో పాగా వేయడానికి సర్వశక్తులూ ఒడ్డారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే..  బెంగాల్ ప్రజలు 'దీదీ' పక్షాన నిలిచారా లేక మోదీ  పరివర్తన్  నినాదానికి జై కొట్టారా అనేది ఫలితాలు వల్లడయ్యే వరకూ వేచి చూడాల్సింది. 

గతంలో నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారనే వార్తలు వచ్చినా..  రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ   బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు మతపరమైన ధ్రువీకరణ..  కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు లాభిస్తాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్,   లెఫ్ట్ కూటమి ఈ ఎన్నికల్లో నామమాత్రపు ప్రభావానికే పరిమితం కావచ్చని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి.  చాలా సర్వేల్లో వారు ఒంటి సంఖ్యకే పరిమితమవుతారని అంచనా వేశారు. 

మొత్తానికి బెంగాల్ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరికి పట్టం కడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీదీ తన పట్టు నిలుపుకుంటారా?  మోదీ హవా బెంగాల్ కోటను దాటుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.  

By
en-us Political News

  
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.