సంక్షేమ పథకాల రీ ఇంజనీరింగ్ జరగాలి!

Publish Date:Feb 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేటాయింపులు,  అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ తో  వాస్తవ వేదిక వేదికగా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం ఇంది. 

పీవీ రమేష్ 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా,  ఆరోగ్య శాఖ  కార్యదర్శిగా  పనిచేశారు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి,ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్  వంటి సంస్థల్లో అత్యున్నత స్థాయి పదవులలో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ఆయన కెరీర్ మొత్తంలో నిబంధనల గీత దాటకుండా నిజాయితీగా, నిష్కర్షగా వ్యవహరించారు. తన పరిధిలోనిది కాని పని చేయాల్సి వస్తే సీఎం అయినా సరే ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా ఇది సాధ్యం కాదు సార్ అని చెప్పగలిగిన స్థైర్యం, ధైర్యం ఆయన సొంతం. అటువంటి డాక్టర్ పీవీ రమేష్ బడ్జెట్ అంటే ఏమిటి?  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిమితి, పాపులిజం వల్ల ఎదురయ్యే విపరిణామాలను విపులంగా వివరించారు.  
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ  కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు.   రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అప్పులు చేయకూడదు.  15వ ఆర్థిక సంఘం వరకు రాష్ట్రాలు తమ జిఎస్‌డిపి  లో 3.5% వరకు అప్పు తీసుకోవచ్చు. అయితే 16వ ఆర్థిక సంఘం దీనిని మూడు శాతానికి తగ్గించింది.   రాష్ట్ర విభజనకు ముందు వరకూ  అప్పులు 2.5% కంటే తక్కువగా ఉండేవన్న ఆయన అప్పట్లో రెవెన్యూ సర్ ప్లస్ ఉండేదని వివరించారు. అయితే  ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వం నేరుగా చేసే అప్పులే కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసే బడ్జెటేతర అప్పులు  ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయన్నారు. 

ఇక సాధారణంగా ఖర్చు పెట్టే డబ్బు వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం వస్తుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెరుగుతాయి అన్నది హేతువుగా ఉండాలన్న పీవీ రమేష్.. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం అటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ లబ్ధే లక్ష్యంగా సొమ్ముల పందేరానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీవీ రమేష్ అన్నారు.   పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఖర్చు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో  30 శాతానికి పైగా పిల్లలు పోషకాహార లోపం, 50 శాతం మంది  మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ బడ్జెట్ లో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలంటే..  ఉన్న అప్పులు ఎంత, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే  వాటి విషయంలో పారదర్శకత పాటించి సవరించుకోవాలన్నారు.   ఎక్కువ వడ్డీకి తీసుకున్న అప్పులను తక్కువ వడ్డీకి మార్చుకునే మార్గాలను అన్వేషించాలి. సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలి. తల్లికి వందనం వంటి పథకాలను ధనికులకు కూడా వర్తింప చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.  విద్య, వైద్యం,   పోషకాహారం వంటి వాటిపై పై పెట్టుబడి పెట్టాలన్నారు.  ప్రతి పథకాన్ని మళ్ళీ సమీక్షించి, దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉందో చూసి రీ-ఇంజనీరింగ్ చేయాలని డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. 

డాక్టర్ పీవీ రమేష్ తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  వీక్షించండి.

 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.