తక్కువ సమయంలో బరువు తగ్గాలని అనుకునేవారికి బెస్ట్ టిప్స్ ఇదిగో..!

Publish Date:Oct 31, 2025

Advertisement

 


మనం ఏమి చేసినా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మన ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి వరకు..  ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే ప్రతి పనీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం మంచి అలవాట్లను అలవర్చుకుంటే, శరీరం,  మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట  పాటించే అలవాట్లు బరువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటారు.  బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు.  అలవాట్లలో చిన్న మార్పులే మంచి  ఫలితాలు ఇస్తాయి.  త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి సులభంగా అలవాటు చేసుకోగల  అలవాట్లు ఏంటంటే..


ఉదయం నిద్రలేచని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది  మరింత ప్రభావవంతంగా పని చేయడానికి, నిమ్మరసం జోడించవచ్చు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవచ్చు.

క్రమం తప్పకుండా వేగంగా వాకింగ్ చేయాలి. నడక ద్వారా బరువును  తగ్గించుకోవచ్చు. అయితే క్రమశిక్షణ చాలా అవసరం. ఏదో చెస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా జాగ్రత్త పడాలి.  నడకను మరింత ప్రభావవంతంగా చేయడానికి, నడక వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లుగా ఉండేలా చూసుకోవాలి.

ఉదయం అల్పాహారం ప్రభావవంతంగా,  సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
అల్పాహారం కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర వీలైనంత వరకు మానేయడం మంచిది. బరువు పెరగడానికి అతిపెద్ద కారణమైన జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

ఉదయం ఎండలో కొంత సమయం గడపాలి.  లేదా 10-15 నిమిషాలు బయట కూర్చోవాలి.. ఉదయం సూర్యకిరణాల నుండి లభించే విటమిన్ డి ఎముకలకు చాలా బలంగా ఉంచుతుంది.

రోజంతా కనీసం నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నిరంతరం నీరు త్రాగుతూ ఉండాలి.

ఉదయాన్నే నిద్రలేవాలి.  ఇది చెప్పడం సులభం, చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల  తగినంత సమయం లభిస్తుంది.  ఈ సమయంలో శ్రద్దగా అన్ని పనులు చేయవచ్చు. ఇది మీ రోజంతా తాజాగా,  సంతోషంగా గడిచిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో జాగింగ్ లేదా రన్నింగ్  కోసం సమయం కేటాయించవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

హాయిగా నిద్రపోవాలి.  7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. నిద్రను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ఎందుకంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఉదయం త్వరగా లేవలేము. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం , తక్కువ నిద్రపోవడం అస్సలు  నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.

                                   *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.