మార్కెట్లో కొనే ఓఆర్ఎస్ వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేస్కోండి!

Publish Date:Jun 5, 2026

Advertisement


వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే  రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది.  వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు.   కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

ఓఆర్ఎస్ తయారు చేసే విధానం..

కావలసిన పదార్థాలు..

 1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు
 6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు)
 ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు)

ఎలా తయారు చేయాలి?

ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి.  ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి.

ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..


విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో  సహాయపడుతుంది.

ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి.

డీహైడ్రేషన్  వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది.

అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.  ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి.

ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు.

విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా  వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

                                        *రూపశ్రీ.

By
en-us Political News

  
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.