బరువు తగ్గింది  భారం పెరిగింది

Publish Date:Mar 22, 2025

Advertisement

తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు.
అవును,గతంతో పోల్చుకుంటే, భట్టి విక్రమార్క’ ఎక్కువలకు పోలేదు. గాలిలో దీపం పెట్టి, దేవుడా రక్షించు అన్నట్లు కాకుండా బడ్జెట్ అంచనాలను అంతగా పెంచలేదు. గత సంవత్సరం రూ.2.91కోట్ల బడ్జెట్’ ప్రవేశ పెట్టి, ఆశించిన అంచనాల మేరకు ఆదాయం లేక భంగ పడిన అనుభవంతో కావచ్చును, ఈసారి కొంత జాగ్రత్త పడ్డారు. అంకెల గారడీ జోలికి పెద్దగా పోకుండా బడ్జెట్ రూపొందించారు. అలాగని, పూర్తి వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపొందించారా,అంటే లేదు. అనవసర గొప్పలకు పోకుండా, గత సంవత్సరపు రూ. 2.91 కోట్లకు నాలుగు శాతం అదనంగా కలిపి రూ’.3.04,965 కోట్ల అంచనాలతో బడ్జెట్’ను సమర్పించారు.
నిజానికి, అప్పులు కూడా పుట్టని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో, ఈ బరువు కూడా ప్రభుత్వానికి మోయలేని  భారమే అవుతుంది.జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది, అది లేనమ్మకు కొప్పు కుదరదు. సవరమో, విగ్గో తప్పవు.  రాష్ట్ర ప్రభుత్వానిది అదే పరిస్థితి,   కేంద్ర ప్రభుతం కరుణించి, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి అప్పుల విషయంలో కల్పించిన వెసులు బాటు కల్పిస్తే ఏమో కానీ, లేదనే కష్టమే అంటున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుగ్వం ప్రభుత్వ భూముల మ్మకం మీద  చాలా ఆశలు పెట్టుకుంది. 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్, అంచనాలను భారీగా,(సగటున 14 శాతం వంతున పెంచుకుంటూ పోయింది. అయితే, అలా అవాస్తవిక అంచనాలతో పెరిగిన బడ్జెట్ బరువు, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు, అనుబహంలో తెలిసింది,. అయిన చివరి వరకు అదే పంథాలో వెళ్ళింది. అయినా, వాస్తవ వ్యయం అంచనాల దరిదాపుకు కూడా వెళ్ళలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు అప్పులు.. ఈ ఒక్క విషయంలో మాత్రం, అంచనాలను  మించి అప్పులు చేశారు. అందుకే, ఇప్పడు అప్పులు కూడా పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరిందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ జనం ముందు ఘోల్లు  మంటున్నారు.
అవును. నిజమే, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నట్లుగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసింది. అందులో అనుమానం లేదు. అందుకే రాష్ట్ర అప్పుల్లో కూరుకు పోయిది. అయితే అదేదో, ఇప్పడే వెలుగులోకి వచ్చిన విషయం కాదు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో చేసిన, పెంచిన అప్పుల భారం కూడా రహస్యం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పడు ముఖ్యమంత్రి ‘విప్పి’ చెపుతున్న, అప్పుల లెక్కలే, ప్రతిపక్షంలో ఉన్నప్పడు, చెప్పారు. అంటే, రాష్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది, తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికల గెలుపే లక్ష్యంగా.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్’కు మించి ఆరు గ్యారెంటీలను, ఇంకా ఎన్నో హామీలను ఇచ్చింది. ఇక్కడే, రాజకీయ ప్రత్యర్దులే కాదు, ఆర్థిక వేత్తలు, చివరకు సామాన్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. సంక్షేమా పథకాలకు పెద్ద పీత వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డే, అప్పట్లో, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని అనేవారు,. నిన్నటి బీఆర్ఎస్, ప్రభుత్వం గానీ,  ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఓటు  బ్యాంకు రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థిక క్రమశిక్షణకు ఇవ్వలేదు. సంక్షేమం ప్రభుత్వ బాధ్యత, అదే గీత దాటితే ఆర్థిక సంక్షోభం అనివార్యమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగంది అదే జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా,పంథా మారటం లేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప మారిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే చట్రంలో ముందుకుసాగుతోంది. ఒక లక్ష్యం,గమ్యం లేకుండా ఎటు పోతున్నామో తెలియకుండా, గత  ప్రభుత్వం పరిచిన అప్పుల బతాలో పడిపోతోంది, అందుకే ముఖ్యమంత్రి అప్పులు పుట్టడం లేదని గగ్గోలు  పెడుతున్నారు.  
ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేసన అప్పుల పద్దులో, రూ. 1.53 లక్షల కోట్లు చెల్లించిందని ఆర్థిక మంత్రి  స్వయంగా చెప్పారు. మరో వంక గడచిన 15 నెలల కాలంలో రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయనే చెప్పారు. నిజానికి, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందనేందుకు ఇంతకూ మించిన ఉదాహరణ అవసరం లేదు. ఆప్రభుత్వం ఈ ప్రభుత్వానికి

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.